China Rocket: ప్రపంచం నెత్తిన మరో బాంబు వేసిన డ్రాగన్ కంట్రీ

US Tracking China Out Control 5B Rocket Set Re enter Earth
x

చైనా రాకెట్

Highlights

China Rocket: నియంత్రణ కోల్పోయి భూమివైపు దూసుకొస్తున్న రాకెట్

China Rocket: ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ కంటే ప్రమాదంగా దాపురించింది మాయదారి చైనా. ఇప్పటికే వైరస్ పుట్టుకకు కారణమై ప్రపంచం ముందు దోషిగా మిగిలిన డ్రాగన్ కంట్రీ.. మరోసారి తన చేతకాని తనంతో ప్రమాదాన్ని కొనితెచ్చింది. అయితే ఈసారి మాత్రం ఓ రాకెట్ రూపంలో ఆ ప్రమాదం ముంచుకొస్తోంది. ఇంతకూ ఆ చైనా రాకెట్ ఏంటి..? దాని కారణంగా ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తోంది.?

కరోనా నుంచి కోలుకోక ముందే ప్రపంచం నెత్తిన డ్రాగన్ కంట్రీ మరో బాంబు వేసింది. చైనా అంతరిక్షంలోకి పంపిన ఓ రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమివైపు దూసుకొస్తోంది. అది ఏ క్షణానైనా భూమిని తాకొచ్చని సైంటిస్టులు ఆందోళన పడుతున్నారు. ఏప్రిల్ 29న భూమి నుంచి బయలుదేరి చైనా స్పేస్ స్టేషన్‌ తియాన్హే కి చెందిన కోర్ మాడ్యూల్‌ని మోసుకెళ్లిన లాంగ్ మార్చ్ 5B రాకెట్ పేలిపోయింది. శాస్త్రవేత్తలు రాకెట్‌ను కంట్రోల్ చెయ్యలేకపోడంతో పేలిన రాకెట్ శకలాలు ఇప్పుడు భూమివైపు దూసుకొస్తున్నాయి.

సాధారణంగా కూలిపోయిన రాకెట్లు సముద్రంలో పడుతుంటాయి. కానీ చైనా ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ మాత్రం భూమి వైపు దూసుకురావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. రాకెట్ ఎక్కడ పడుతుందో తెలియక శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు. అయితే అమెరికా రక్షణ శాఖ ప్రస్తుతం 5బీ రాకెట్‌ను ట్రాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నెల 8న రాకెట్ భూమ్మీదకు వచ్చే అవకాశం ఉందని పెంటగాన్‌ సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే అది సరిగ్గా ఏ ప్రదేశంలో భూ వాతవరణంలోకి ప్రవేశిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు.

మరోవైపు లాంగ్ మార్చ్ 5బీ రాకెట్‌ బరువు సుమారు 21 టన్నులు. ఇది ఏ క్షణానైనా భూమిపై పడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షంలో సొంత స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న చైనా దీనిలో భాగంగా మొదటి మాడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ నిర్మించడం కోసం లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ తియాన్హే స్పేస్‌ మ్యాడుల్‌ను అంతరిక్షంలోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి చేర్చింది. అక్కడ నియంత్రణ కోల్పోయిన రాకెట్‌ శకలాలు భూమి మీదకు దూసుకొస్తున్నాయి.

ఇక.. దూసుకొస్తున్న ఈ రాకెట్ ప్రతి 90 నిమిషాలకు ఓసారి భూమి చుట్టూ తిరుగుతోంది. అందువల్ల ఇది న్యూయార్క్ లేదా మాడ్రిడ్ లేదా బీజింగ్‌పై పడవచ్చనీ లేదంటే. చిలీ, వెల్లింగ్టన్, న్యూజిలాండ్‌పై పడే ప్రమాదం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. నిజానికి రాకెట్‌కి సంబంధించిన శకలాల్లో చిన్న చిన్న ముక్కలన్నీ గాలి ఒరిపిడి వల్ల కాలి బూడిద అవుతాయి. పెద్ద పెద్ద ముక్కలు మాత్రం భూమిపై పడతాయి అని స్టీడీ స్టేట్ ఓషన్ ఎక్స్‌ప్లోరర్ తెలిపింది. అందరూ అన్ని అంచనాలు వేస్తున్నారు గానీ ఖచ్చితంగా శకలాలు ఎక్కడ కూలుతాయో చెప్పలేకపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories