Indian-American: అమెరికా బండిని నడిపేది మనోళ్లే..ఇండియానా మజాకా

Indian-American: అమెరికా బండిని నడిపేది మనోళ్లే..ఇండియానా మజాకా
x
Highlights

Indian-American: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారు....

Indian-American: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. అంతకుముందు ఆయన పలు శాఖల అధిపతుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఇప్పటి వరకు నలుగురు భారతీయులు ఉన్నారు. వారెవరూ చూద్దాం.

ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) డైరెక్టర్ పదవికి తన సన్నిహితుడు కాష్ పటేల్‌ను నామినేట్ చేశారు. తన ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికను ట్రంప్ కూడా వ్యక్తం చేశారు. ఈ పదవికి పటేల్ ఎంపిక ముఖ్యమైనది. ఈ విధంగాట్రంప్ కొత్త ప్రభుత్వంలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి ముఖ్యమైన స్థానం లభించింది.

కాష్ పటేల్

. అమెరికాలో శాంతిభద్రతలు, జాతీయ భద్రతను బలోపేతం చేయడంపై కాష్ పటేల్ దృష్టి సారిస్తారు. 44 ఏళ్ల పటేల్ 2017లో అప్పటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో చివరి కొన్ని వారాల్లో అమెరికా తాత్కాలిక రక్షణ కార్యదర్శికి 'చీఫ్ ఆఫ్ స్టాఫ్'గా కూడా పనిచేశారు.వృత్తిరీత్యా న్యాయవాది అయిన పటేల్ గుజరాత్‌లోని వడోదరకు చెందినవారు.

వివేక్ రామస్వామి

వివేక్ రామస్వామిని కొత్త ప్రభుత్వ సమర్థత విభాగానికి అధిపతిగా ట్రంప్ ఎంపిక చేశారు. ప్రభుత్వానికి సలహాలివ్వడమే వ్యాపారవేత్త రామస్వామి పని. రామస్వామి సుసంపన్నుడు. ఫార్మాస్యూటికల్ కంపెనీ వ్యవస్థాపకుడు కూడా. అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా వివేక్ రామస్వామి మొదట రేసులో ఉన్నా.. తరువాత అతను తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ట్రంప్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

రామస్వామి తండ్రి వి గణపతి రామస్వామి వృత్తిరీత్యా ఇంజనీర్. తల్లి గీతా రామస్వామి మానసిక వైద్యురాలు. అతని తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వచ్చారు. ఒహియోలోని సిన్సినాటిలో ఆయన పుట్టారు. జాతీయ స్థాయిలో టెన్నిస్ ఆటగాడిగా గుర్తింపు పొందారు.

తులసి గబ్బర్డ్

డెమోక్రటిక్ పార్టీ మాజీ సభ్యురాలు, తులసి గబ్బార్డ్ 'డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్' (DNI)గా వ్యవహరిస్తారు. గబ్బర్డ్ నాలుగు సార్లు ఎంపీగా ఉన్నారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆమె అభ్యర్ధిగా ఉన్నారు. ఆమె ఇటీవలే డెమోక్రటిక్ పార్టీని వీడి రిపబ్లికన్ పార్టీలో చేరారు.

జై భట్టాచార్య

దేశంలోని అత్యున్నత ఆరోగ్య పరిశోధన, నిధుల సంస్థల్లో ఒకటైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) డైరెక్టర్‌గా భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త జై భట్టాచార్యను ట్రంప్ ఎంపిక చేశారు. దీంతో అత్యున్నత పరిపాలనా పదవికి ట్రంప్ నామినేట్ చేసిన తొలి భారతీయ అమెరికన్‌గా భట్టాచార్య నిలిచారు.

ఉషా వాన్స్

ట్రంప్-వాన్స్ విజయంతో 38 ఏళ్ల ఉష అమెరికాకు రెండో మహిళగా నిలవన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రంప్ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ఒహియో సెనేటర్ J.D. వాన్స్ (39)తో ఉష ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories