Donald Trump's On Coronavirus Vaccines: కరోనాకు వ్యాక్సిన్‌పై ట్రంప్ ట్వీట్.. ఆ గ్రేట్ న్యూస్ ఇదేనా? నేడు ప్రకటన!

Donald Trumps On Coronavirus Vaccines: కరోనాకు వ్యాక్సిన్‌పై ట్రంప్ ట్వీట్.. ఆ గ్రేట్ న్యూస్ ఇదేనా? నేడు ప్రకటన!
x
US President Donald Trump’s ‘great news on vaccines’ tweet is short on details
Highlights

Donald Trump's On Coronavirus Vaccines: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘గ్రేట్ న్యూస్ ఆన్ వ్యాక్సిన్స్’ అంటూ ట్వీట్ చేసిన ట్రంప్ ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు

Donald Trump's On Coronavirus Vaccines: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. 'గ్రేట్ న్యూస్ ఆన్ వ్యాక్సిన్స్' అంటూ ట్వీట్ చేసిన ట్రంప్ ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. కరోనాకు అమెరికా వ్యాక్సిన్ ను కనిపెట్టిందేమో అని ప్రపంచమంతా ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది. ఇందుకే గ్రేట్ న్యూస్ ఆన్ వ్యాక్సిన్స్ అంటూ ట్రంప్ ట్వీట్ చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ పై అమెరికా మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు. అయితే బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ టీకా క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను గురువారం ప్రకటించవచ్చంటూ బ్రిటన్ ఐటీవీ సంపాదకుడిని ఉటంకిస్తూ రాయిటర్స్ ఒక వార్త వెల్లడించింది. ప్రముఖ బయోటెక్ సంస్థ మోడరనా COVID-19 కోసం తయారు చేసిన వ్యాక్సిన్ సురక్షితం అని తేలింది.. ప్రారంభ దశలో మొత్తం 45 మంది ఆరోగ్య వాలంటీర్లలో యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్టు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ బుధవారం ప్రకటించింది.

ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించబడిన దాని ప్రకారం.. ప్రారంభ ట్రయల్స్ 18 నుండి 55 సంవత్సరాల వయస్సు గల మొదటి 45 మంది మందిపై నిర్వహించారు. ఈ ట్రయల్స్ సీటెల్ లోని అధ్యయన ప్రదేశాలలో అలాగే యుఎస్ లోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో చేశారు. దీంతో ఈ అధ్యయనం ప్రకారం, పాల్గొన్న వారందరిలో పరిశోధనాత్మక టీకా - mRNA- 1273 కరోనావైరస్ SARS-CoV2 కు వ్యతిరేకంగా రోగనిరోధక ప్రతిస్పందనలను ప్రేరేపించింది.. అంతేకాదు ట్రయల్స లో భద్రతా సమస్యలు ఏవీ గుర్తించబడలేదు అని పేర్కొంది. దీంతో తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో సత్ఫలితాలను ఇచ్చినట్లు అమెరికా ప్రకటించింది. త్వరలోనే తదుపరి దశ ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. జులై 27 తర్వాత తదుపరి దశ ప్రయోగాలను 30 వేల మంది వాలంటీర్లపై మోడెర్నా నిర్వహించనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories