US Elections 2024: అమెరికా ప్రెసిడెంట్ ఎవరైతే భారత్‌కి మేలు... స్పందించిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్

US Elections 2024: అమెరికా ప్రెసిడెంట్ ఎవరైతే భారత్‌కి మేలు... స్పందించిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్
x
Highlights

EAM S Jaishankar about Donald Trump vs Kamala Harris in US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా ఓటర్లు పోలింగ్ కేంద్రాల...

EAM S Jaishankar about Donald Trump vs Kamala Harris in US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. డెమొక్రాట్స్ పార్టీ నుండి కమల హారీస్, రిపబ్లికన్స్ పార్టీ నుండి డోనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా నడుస్తోంది.అసలు ఈ ఇద్దరిలో ఎవరు గెలిస్తారు? ఎవరు గెలిస్తే ఎలా ఉంటుంది అనే అంశంలో చాలా చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాతో భారత్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే కోణంలోనూ ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. ఇక్కడే పలు అంశాలు చర్చకొస్తున్నాయి.

ఉదాహరణకు ఎంతోమంది భారతీయులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తుంటారు. అక్కడే మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ H1B వీసా కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ అమెరికా ప్రభుత్వం తీసుకునే ఇమ్మిగ్రేషన్ పాలసీ నిర్ణయాలు వీళ్ల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంటాయి. ఆ ప్రభావం భారతీయులకు అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా ఉంటుందా అనేది అమెరికా ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే రాబోయే ప్రెసిడెంట్ ఎవరైతే అమెరికా - భారత్ సంబంధాలు ఎలా ఉంటాయనే అంశంపై భారతీయులు చర్చించుకుంటున్నారు.

తాజాగా ఇదే అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ గెలిచినా లేదా కమల హారీస్ గెలిచినా.. అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయే తప్ప తగ్గవు అని అన్నారు. ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి పెన్నీ వాంగ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

US Elections 2024 Explainer: అమెరికా ప్రెసిడెంట్‌ను ఎలా ఎన్నుకుంటారో పూర్తిగా తెలియాలంటే ఇదిగో ఈ కింది వీడియోపై ఓ లుక్కేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories