పెద్ద రాష్ర్టాల్లో బైడెన్ ఆధిక్యం..ట్రంప్ ఆశలు గల్లంతు..

పెద్ద రాష్ర్టాల్లో బైడెన్ ఆధిక్యం..ట్రంప్ ఆశలు గల్లంతు..
x
Highlights

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. చాలా రాష్ట్రాల్లో నువ్వానేనా...

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. చాలా రాష్ట్రాల్లో నువ్వానేనా అన్నట్లు కొనసాగుతోన్న ఎన్నికలు.. హై ఓల్టేజ్ టెన్షన్‌ రేపుతున్నాయి.

ఎన్నికల ఫలితాల లెక్కింపులో ముందు ఆధిపత్యం సాధించిన ట్రంప్‌ ఆ తర్వాత కాస్త వెనకబడ్డారు. ట్రంప్‌ ఆశలు గల్లంతు చేస్తూ బైడెన్‌ దూసుకుపోయారు. ఇప్పటివరకు బైడెన్‌కు 131, ట్రంప్‌కు 98 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. అయితే చాలా రాష్ట్రాల్లో మళ్లీ ట్రంప్ గ్రాఫ్ పెరిగిపోతుండటంతో గెలుపెవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇక ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో పెన్సిల్వేనియా, వెర్మాంట్‌, న్యూజెర్సీ, మేరీల్యాండ్‌, డెలావేర్‌, రోడ్‌ఐలాండ్‌లో బైడెన్‌ విజయం సాధించారు. టెక్సాస్‌, కాన్సాస్‌, మిస్సోరీలలో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇండియానా, ఓక్లహోమా, కెంటకీ, వర్జీనియా, సౌత్‌ కరోలినాలో ట్రంప్‌ విజయం సాధించారు. ఫ్లోరిడా, జార్జియాలలో ముందంజలో ఉన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలను కైవసం చేసుకున్న ఇద్దరు అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా ఎన్నికలపై భారతీయుల్లో ఆసక్తి నెలకొంది. అమెరికాలో ఇండియన్స్ అధికంగా ఉండటంతో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష రేసులో భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్‌ బరిలో ఉన్నారు. దీంతో కమలా గెలుపు కోసం తమిళనాడులో పూజలు కూడా చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories