అనూహ్యంగా ఆధిక్యంలోకి ట్రంప్.. మరోసారి అధ్యక్ష పీఠం దిశగా..

అనూహ్యంగా ఆధిక్యంలోకి ట్రంప్.. మరోసారి అధ్యక్ష పీఠం దిశగా..
x
Highlights

అమెరికా ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటిదాకా జో బైడెన్ ఆధిక్యంలో ఉన్నా అనూహ్యంగా ట్రంప్ లీడింగ్‌లోకి వస్తుండటం ఆసక్తి రేపుతోంది. చాలా...

అమెరికా ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటిదాకా జో బైడెన్ ఆధిక్యంలో ఉన్నా అనూహ్యంగా ట్రంప్ లీడింగ్‌లోకి వస్తుండటం ఆసక్తి రేపుతోంది. చాలా రాష్ట్రాల్లో డెమొక్రటిక్ పార్టీ ఊహించినట్లే ఆధిపత్యం కొనసాగించినా కీలక రాష్ట్రాల్లో ట్రంప్ హవానే కొనసాగుతోంది. ఇప్పటికే డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా భావించే ఓహియోలో ట్రంప్ విజయం సాధించటంతో ఫలితాలు ఒక్కసారిగా మారిపోయాయి.

అధ్యక్షుడిని నిర్ణయించే మరో కీలక రాష్ట్రం ఫ్లోరిడాలోనూ ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది. ప్రీ పోల్స్ సర్వేలన్నీ డెమొక్రటిక్‌ పార్టీకే పట్టం కడతారని వెల్లడించినా ఫలితాలు తలకిందులయ్యాయి. ముందు నుంచి స్వల్ప ఆధిక్యంలో ఉన్న ట్రంప్ క్రమంగా భారీ ఆధిక్యంలోకి వచ్చారు. దీంతో దాదాపు ఫ్లోరిడా కూడా ట్రంప్‌ వశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక మిగిలిన స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంప్‌దే హవా కొనసాగుతోంది. జార్జియా, టెక్సాస్‌లో ట్రంప్ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే మరోసారి అధ్యక్ష పీఠం ట్రంప్ కైవసం కావటం ఖాయమంటున్నారు విశ్లేషకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories