Titanic: ఆ విషాదం మరువకముందే.. టైటాన్‌ తరహాలో మరో సాహస యాత్ర..!

US Billionaire Plans Submersible Trip to Titanic Wreck
x

Titanic: ఆ విషాదం మరువకముందే.. టైటాన్‌ తరహాలో మరో సాహస యాత్ర..!

Highlights

Titanic: టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్‌ మినీ జలాంతర్గామి విషాదాంతం మరిచిపోకముందే మరో ఇద్దరు ఈ యాత్రకు సిద్ధమయ్యారు.

Titanic: టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్‌ మినీ జలాంతర్గామి విషాదాంతం మరిచిపోకముందే మరో ఇద్దరు ఈ యాత్రకు సిద్ధమయ్యారు. అమెరికాలోని ఒహాయోకు చెందిన రియల్‌ ఎస్టేట్ ఇన్వెస్టర్ లారీ కానర్‌.. ఈ సాహస యాత్రను సురక్షితంగా పూర్తిచేయొచ్చని నిరూపించాలనుకుంటున్నారు. ఈసారి ట్రిటాన్ సబ్‌మెరైన్స్ సహ వ్యవస్థాపకుడు పాట్రిక్‌ లాహేతో పాటు లారీ.. సముద్రంలో 12 వేల 400 అడుగుల లోతు వరకు వెళ్లనున్నారు. మహాసముద్రం ఎంతో శక్తివంతమైనదే అయినా.. సరైనమార్గంలో వెళితే అదొక అద్భుతమని, జీవితాన్ని మార్చేస్తుందని తెలియజేయాలని అనుకుంటున్నానని చెప్పారు.

‘‘మహాసముద్రం ఎంతో శక్తివంతమైనదే అయినా.. సరైనమార్గంలో వెళితే అదొక అద్భుతమని, జీవితాన్ని మార్చేస్తుందని తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈ మినీ జలాంతర్గామి (Triton 4000/2 Abyssal Explorer) రూపకల్పనకు పాట్రిక్ పదేళ్లకు పైగా కష్టపడ్డారు. గత ఏడాది టైటాన్‌ పేలుడు వార్త వినగానే వెంటనే నేను పాట్రిక్‌కు కాల్‌ చేశాను. దానికంటే మెరుగైన వెస్సెల్‌ను తయారుచేయాలని చెప్పాను’’ అని కానర్ వెల్లడించారు. లాహే మాట్లాడుతూ.. ‘‘పదేపదే సురక్షిత ప్రయాణాలు చేయగల, టైటాన్‌కు విరుద్ధమైన వాహక నౌకను చేయగలరని ప్రపంచానికి చాటిచెప్పాలని కానర్ నాకు చెప్పేవారు’’ అని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories