US Funding Bill: షట్ డౌన్ గండం నుంచి బయటపడిన అమెరికా

US Avoids Government Shutdown
x

US Funding Bill: షట్ డౌన్ గండం నుంచి బయటపడిన అమెరికా

Highlights

అమెరికా (USA) షట్ డౌన్ (Shut Down) నుంచి చివరి నిమిషంలో బయటపడింది.

అమెరికా (USA) షట్ డౌన్ (Shut Down) నుంచి చివరి నిమిషంలో బయటపడింది. ప్రతినిధుల సభలో స్పీకర్ మైక్ జాన్సన్ (Mike Johnson) ప్రవేశ పెట్టిన కొత్త ప్రణాళికకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు సెనెట్ కూడా ఆమోదించింది. 2025 మార్చి వరకు ప్రభుత్వ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులుండవు.

అసలు ఏం జరిగింది?

ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన అవసరమైన నిధుల కోసం జో బైడెన్ (Joe Biden) సర్కార్ తెచ్చిన బిల్లును డోనల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా వ్యతిరేకించారు. ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులను సమకూర్చడంతో పాటు వివిధ ఆర్ధిక బాధ్యతలు నిర్వహణకు ఈ బిల్లులో రెండేళ్ల పాటు రుణాలపై పరిమితిని ఎత్తివేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. బైడెన్ బిల్లులో ట్రంప్ ప్రతిపాదనలను స్పీకర్ మైక్ చేర్చి ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టారు. అయితే దీన్ని 235-174 తో సభ తిరస్కరించింది. 38 మంది రిపబ్లికన్ సభ్యులు డెమాక్రాట్లతో కలిసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేశారు.

ఈ పరిణామాలతో ట్రంప్ వెనక్కి తగ్గారు. ఫెడరల్ కార్యకలాపాలు, విపత్తు సహకారానికి నిధులకు సంబంధించిన 118 పేజీల కొత్త ప్యాకేజీ బిల్లును స్పీకర్ సభలో ప్రవేశ పెట్టారు. 366-34 ఓట్లతో ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సెనెట్ లో కూడా 85-11 ఓట్లతో దీనికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ బిల్లులో 110 బిలియన్ డాలర్లు అత్యవసర విపత్తు సాయం, రైతులకు 30 బిలియన్ డాలర్ల సాయం వంటివి ఉన్నాయి.

షట్ డౌన్ అయితే ఏం జరిగేది?

షట్ డౌన్ అయితే ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బంది. వార్షిక నిధుల కేటాయింపుతో ప్రభుత్వ కార్యకలాపాలు సాగుతాయి. ఇందుకోసం 12 బిల్లులను పాస్ చేస్తారు. ఈ బిల్లులు పాస్ కాకపోతే ఖర్చు పెట్టడానికి నిధులుండవు. అయితే అత్యవసర సేవలైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, వైద్య సేవలు, సరిహద్దు భద్రత వంటి వాటికి నిధుల కొరతకు ఇబ్బందులుండవు. సామాజిక భద్రత, వైద్య అవసరాల వంటి కార్డులు జారీ నిలిచిపోతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో కూడా ఇదే రకమైన పరిస్థితి వచ్చింది. అప్పట్లో స్పీకర్ నిధులను బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నించారు.

1981 నుంచి అమెరికాలో షట్ డౌన్

అమెరికాలో 1981 నుంచి 2018 వరకు 15 సార్లు షట్ డౌన్ జరిగింది. 1995 డిసెంబర్ లో 21 రోజులు, 2018 డిసెంబర్ లో అత్యధికంగా 35 రోజులు షట్ డౌన్ సాగింది. ఇదే అమెరికా చరిత్రలో షట్ డౌన్ అత్యధిక కాలంగా చెబుతారు. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories