చిలీలో ఆగని కార్చిచ్చు.. 64 మంది మృతి

Unstoppable Fire in Chile 64 People Died
x

చిలీలో ఆగని కార్చిచ్చు.. 64 మంది మృతి 

Highlights

Chile: అగ్నికి ఆహుతైన 11,00 ఇళ్లు

Chile: అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చిలీలో చెలరేగిన కార్చిచ్చు ఆగడం లేదు. ఇప్పటివరకు కనీసం 64 మంది మృతిచెందినట్లు అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ వెల్లడించారు. వేలాది మంది గాయపడినట్లు తెలిపారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. దాదాపు 11 వందల ఇళ్లు మంటల్లో కాలిబూడిదైనట్లు పేర్కొన్నారు. కార్లు, ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు.

సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని బోరిక్ విజ్ఞప్తి చేశారు. మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని.. వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ.. పరిస్థితులను మరింత దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చు మంటుచెలరేగినట్లు మంత్రి కరోలినా వెల్లడించారు. మంటల తీవ్రత అధికంగా ఉన్న వాల్పరైజో ప్రాంతం నుంచి ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories