రష్యా నుంచి 1358 బందీల విడుదల: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

రష్యా నుంచి 1358 బందీల విడుదల: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
x

రష్యా నుంచి 1358 బందీల విడుదల: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

Highlights

గతే ఏడాది తమ దేశానికి చెందిన 1358 మంది సైనికులు, పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని తెలిపారు

Volodymyr Zelenskyy: గతే ఏడాది తమ దేశానికి చెందిన 1358 మంది సైనికులు, పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని తెలిపారు.వారిని విడిపించేందుకు ఉక్రెయిన్ అధికారులు చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు.ఎక్స్ లో ఈ విషయాన్ని ఆయన పోస్టు చేశారు.ఉక్రెయిన్-రష్యాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక విషయాలు తెలిపారు.

2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉందని తెలిపారు. రష్యా దగ్గర బందీలుగా ఉన్న సైనికులు, పౌరుల విడుదలలో మిత్ర దేశాలు కీలక పాత్ర పోషించాయని ఆయన అన్నారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధం ఈ ఏడాదిలోనే ముగియాలని ఆయన ఆకాంక్షించారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించేందుకు ట్రంప్ చర్చిస్తారని ఆయన అన్నారు.రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చించి యుద్ధాన్ని ముగిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన 30వేల మంది చనిపోయారు. ఉక్రెయిన్‌లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని ఐక్యరాజ్యసమితిలోని ఉక్రెయిన్ మానవతావాద సమన్వయకర్త మథియాస్ ష్మాలే గతంలో తెలిపారు. అంతేకాదు 3,400 కంటే ఎక్కువ పాఠశాలలు, ఆస్పత్రులు దెబ్బతిన్నాయని అన్నారు. 10 మిలియన్ల మంది పౌరులు తమ ఇళ్లను వీడారని ఆయన ప్రకటించారు.

మరోవైపు రష్యా గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌లోని మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేస్తోంది. కొత్త సంవత్సరం వేళ ఉక్రెయిన్ పై భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. కాగా రష్యా దాడుల్లో తమ దేశంలోని దాదాపు సగం మౌళిక సదుపాయాలు నాశనమైనట్టు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories