డ్రెస్ కోడ్ పాటించలేదని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీకి ఎదురుదెబ్బ.. మహిళకు రూ.32 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం

UK Woman Sacked for Wearing Sports Shoes to Work, Receives Rs 32 Lakh Compensation
x

డ్రెస్ కోడ్ పాటించలేదని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీకి ఎదురుదెబ్బ.. మహిళకు రూ.32 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం

Highlights

UK Woman: డ్రెస్ కోడ్ పాటించలేదని ఉద్యోగం నుంచి తొలగించిన లండన్‌లోని ఓ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది.

UK Woman: డ్రెస్ కోడ్ పాటించలేదని ఉద్యోగం నుంచి తొలగించిన లండన్‌లోని ఓ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎలిజబెత్ బెనాస్సీ 2022లో లండన్‌లోని మ్యాక్సిమస్ యూకే సర్వీసెస్ లో ఉద్యోగంలో చేశారు. అయితే ఆమె డ్రెస్ కోడ్ పాటించలేదని ఆ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఎలిజబెత్ ఉద్యోగ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. వాదనలు విన్న ట్రైబ్యునల్ ఎలిజబెత్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అంతేకాదు ఆ మహిళకు 32 లక్షల (30 వేల పౌండ్లు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

యూకే సర్వీసెస్ లో ఉద్యోగంలో చేరిన కొన్ని రోజుల తర్వాత బెనాస్సీ.. డ్రెస్ కోడ్ పాటించకుండా స్పోర్ట్స్ షూ వేసుకొచ్చిందంటూ ఆరోపిస్తూ కంపెనీ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో బెనాస్సీ ఉద్యోగ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా డ్రెస్ కోడ్ ఉందని తనకు తెలియదని తెలిపారు. తెలియకుండా షూ వేసుకుని వెళ్లినందుకు ఓ మేనేజర్ తనను నిందించారని పేర్కొన్నారు.

అయితే బెనాస్సీ వాదనను ఆ కంపెనీ వ్యతిరేకించింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ట్రైబ్యునల్ ఎలిజబెత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అంతేకాకుండా తనకు రూ.32 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఆమె ఉద్యోగానికి కొత్త. డ్రెస్ కోడ్ గురించి తనకు తెలిసి ఉండకపోవచ్చు. ఇంకో అవకాశం ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగించడం తప్పు అని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories