Twitter: ఎలాన్‌ మస్క్ చేతి నుంచి ఎగిరిపోయిన డిజిటల్‌ పిట్ట

Twitter Says Waiting Period For Elon Musks Deal Is Over
x

Twitter: ఎలాన్‌ మస్క్ చేతి నుంచి ఎగిరిపోయిన డిజిటల్‌ పిట్ట

Highlights

Twitter: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు ట్విట్టర్‌ షాకిచ్చింది. 4వేల 400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్‌ స్పామ్‌ ఖాతాల విషయమై డీల్‌ను తాత్కాలికంగా నిలిపేశారు.

Twitter: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు ట్విట్టర్‌ షాకిచ్చింది. 4వేల 400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్‌ స్పామ్‌ ఖాతాల విషయమై డీల్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే సోషల్‌ మీడియా దిగ్గజాన్ని కొనుగోలు కోసం ఇచ్చిన సమయం కాస్తా ముగిసింది. దీంతో ఇప్పుడు పాత డీల్‌ క్యాన్సిల్‌ అయ్యింది. ఇది ట్విట్టర్‌కు వరంగా మారింది. ట్విట్టర్‌ విధించిన షరతుల మేరకు ఎలాన్‌ మస్క్‌ కోనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు డీల్‌ జరగాలంటే ట్విట్టర్‌ స్టాక్‌ హోల్డర్లందరూ తప్పనిసరి ఆమోదించాల్సి ఉంటుంది. ట్విట్టర్‌ను సొంతం చేసుకోవాలని భావించిన ఎలాన్‌ మస్క్‌కు ఇది పెద్ద దెబ్బ అని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ట్విట్టర్‌ ధరను ఆ సంస్థ బోర్డు భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయి.

మొదటి నుంచి ట్విట్టర్‌పై ఎలాన్‌ మస్క్‌ మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. జనవరిలోనే ఆ కంపెనీ నుంచి 9శాతానికి పైగా షేర్లను కొనుగోలు చేసి అత్యధిక వాటాను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ఏకంగా ట్విట్టర్నే కొనుగోలు చేసేందుకు మస్క్‌ ప్రయత్నాలు ప్రారంభించారు. సంస్థను తనకు అమ్మేయాలని ట్విట్టర్‌ పూర్తిగా ప్రైవేటు కంపెనీగా మారితేనే వాక్‌ స్వాతంత్రానికి ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని తెలిపారు. సోషల్‌ మీడియా దిగ్గజాన్ని మస్క్‌ కొనుగోలు చేస్తారని తెలిసిన తరువాత కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. చివరికి ఆ సంస్థ బోర్డుపై ఒత్తిడి తెచ్చి మరీ 4వేల 400 కోట్ల డాలర్లకు సంస్థను కొనుగోలు చేశారు. అందుకు ఈక్విటీ ఫైనాన్సింగ్‌ ద్వారా 3వేల 350 కోట్ల డాలర్లు, రుణాలతో 13 వందల కోట్ల డాలర్లను సమకూర్చున్నారు.

ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మరుసటి రోజే సీన్‌ రివర్స్‌ అయ్యింది. టెస్లా కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ కంపెనీ షేర్లను తాకట్టు పెడుతారని మదుపర్లు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఒక్క రోజులోనే 12 వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. అంటే ట్విట్టర్‌ను కొనుగోలుకు వెచ్చిన దానికంటే మూడింతలు నష్టపోయాడు. అదే సమయంలో కరోనా కారణంగా చైనాలో టెస్లా యూనిట్‌ మూతపడింది. దీంతో ట్విట్టర్‌ కొనుగోలుపై ఎలాన్‌ మస్క్‌ పునరాలోచనల్లో పడ్డారు. డిజిటల్‌ పిట్టను వదులుకుంటేనే మేలని భావిస్తున్నట్టు కూడా కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో స్పామ్‌ అకౌంట్ల అంశం మస్క్‌కు కలిసొచ్చింది. ఫేక్‌ ఖాతాల విషయం తేల్చేవరకు డీల్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే 4వేల 400 కోట్ల డాలర్ల కంటే తక్కువకు కొనుగోలు చేసేందుకే మస్క్‌ మైండ్‌గేమ్‌ ఆడుతున్నట్టు విమర్శలు వచ్చాయి. మస్క్ డీల్‌ నిలిపేయడంతో కంపెనీ షేర్లు కూడా భారీగా పడిపోయాయి. దీనిపై కొందరు మదుపర్లు శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టును కూడా ఆశ్రయించారు. ఇదిలా ఉంటే ఒప్పందం ప్రకారం కొనుగోలుకు ఇచ్చిన సమయం ముగిసింది. దీంతో గతంలో ఎలాన్‌ మస్క్‌ కుదుర్చుకున్న డీల్‌ క్యాన్సిల్‌ అయ్యినట్టే. ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్‌ కొనుగోలు చేయడంలో ఆ సంస్థలోని పలువురు టాప్‌ అధికారుల్లో ఆందోళన నెలకొన్నది. మస్క్‌ చేతికి సంస్థ వెళ్లిపోతే తమకు ఉద్వాసన తప్పదని భావించారు. అయితే ఇప్పుడు డీల్‌ క్యాన్సిల్‌ అవ్వడంతో వారంతా ఊరట పొందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories