America Ban TikTok and WeChat: టిక్ టాక్ పై అమెరికా నిషేధం

America Ban TikTok and WeChat: టిక్ టాక్ పై అమెరికా నిషేధం
x
Highlights

America Ban TikTok and WeChat: క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు చైనాపై ఆంక్షలు విధిస్తున్నాయి. తొలుత మోడీ ప్ర‌భుత్వం డిజిట‌ల్ వార్‌లో భాగంగా టిక్‌టాక్ ను చేసిన విష‌యం తెలిసిందే.

America Ban TikTok and WeChat: క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు చైనాపై ఆంక్షలు విధిస్తున్నాయి. తొలుత మోడీ ప్ర‌భుత్వం డిజిట‌ల్ వార్‌లో భాగంగా టిక్‌టాక్ ను చేసిన విష‌యం తెలిసిందే. ఇది ఇలా ఉంటె .. గత కొన్ని రోజులుగా అమెరికా చైనా మధ్య ప్రాశ్చ‌న్న యుద్ధం జరుగుతుంది. అమెరికాను ఆర్ధికంగా దెబ్బకొట్టాలని చైనా ప్ర‌య‌త్నిస్తుందని, టిక్ టాక్, వీ చాట్ వంటి చైనా అప్ లు అమెరికా పౌరుల వ్య‌క్తిగ‌త స‌మ‌చారాన్ని అందజేస్తున్నాయని టంప్ర్ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ నిషేధిస్తున్నట్లు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిబంధన వచ్చే 45 రోజుల్లో అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను ఆయన జారీ చేశారు. టిక్ టాక్ తో పాటు.. వుయ్ చాట్ పైనా అమెరికా నిషేధం విధించింది. అమెరికా నిబంధనల ప్రకారం టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ తో పాటు వీ చాట్ పై కూడా నిషేధం విధిస్తున్నట్లు అమెరికన్ కాంగ్రెస్ నాయకులకు రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. చైనాకు సంబంధించిన యాప్ లను వివిధ దేశాలు ఒక్కొక్కటిగా బ్యాన్ చేస్తూ వస్తున్నాయి.

భార‌త్ కూడా ఇప్ప‌టికే చాలా ఆప్‌ల‌ను బ్యాన్ చేసిన విష‌యం తెలిసిందే. మరో 250 రకాల యాప్స్ ను మానిటరింగ్ లో పెట్టింది. ఏ క్షణంలో వీటిపై నిషేధం విధిస్తుందో తెలియదు. ఇప్పుడు అమెరికా సైతం టిక్ టాక్, వీ చాట్ లపై నిషేధం విధించటంతో మిగతా దేశాలు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories