USA Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం

Three people from AP died in a terrible road accident in America
x

USA Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం

Highlights

USA Road Accident 3 Telugu People Died: అమెరికాలో ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు మరణించారు. రెండు వాహనాలు ఢీకొన్నడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు మరణించగా..మరో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

USA Road Accident 3 Telugu People Died: అమెరికాలో ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు మరణించారు. రెండు వాహనాలు ఢీకొన్నడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు మరణించగా..మరో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

దక్షిణ బాన్ హామ్ కు ఆరు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మరణించినవారిలో ఒకరిది తిరుపతి జిల్లా కాగా మరో ఇద్దరిది శ్రీకాళహస్తిగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఐదుగురు ఎన్ఆర్ఐలు ప్రాణాలు కోల్పోగా..వీరిలో ఒక మహిళ సహా ముగ్గురు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవారు ఉన్నట్లు గుర్తించారు.

దక్షిణ బాన్ హామ్ కు ఆరు మైళ్ల దూరలో స్టేట్ హైవేపై సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ద్రుష్టికి తెలుసుకెళ్లారు. ఈ ప్రమాదం గురించి టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు కూడా ప్రకటన చేశాయి.

ఈ ప్రమాదంలో మరణించినవారికి తిరుపతికి చెందిన గూడురుకు చెందిన తిరుమూరు గోపీ, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన రాజినేనిశివ, హరితలుగా గుర్తించారు. హరిత భర్త సాయి చెన్ను తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన గోపి, శివ, హరితల మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. సాయి త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు.

అటు గత నెలలో కూడా అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాదీలు మరణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories