బాహుబలి మందు.. రోగం ఏదైనా ఒకే మందు.. కొత్త డ్రగ్‌ను ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు..
University Of Illinois: సాధారణంగా మనకు జ్వరం వచ్చినా.. తలనొప్పి వచ్చినా.. చిన్న చిన్నవి ఇంకేవైనా.. మెడికల్ షాప్‌కు వెళ్లి.. ట్యాబ్లెట్ తీసుకోవడం అలవాటు..
University Of Illinois: మనిషిని వదలకుండా.. ఇబ్బంది పెడుతున్న అన్ని బ్యాక్టీరియాలకు ఒకే మందును శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అమెరికాలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు యాంటీ మైక్రో బయాల్ రిసిస్టెన్స్ -AMRను కనిపెట్టారు. ఇది ఏకంగా 300 బ్యాక్టీరియలపై పని చేస్తున్నట్టు పరిశోధకులు నిర్ధారించారు. తాజాగా ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో బ్యాక్టీరియాలను AMR సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఉన్నడెబియా-1452 అనే యాంటిబయాటిక్‌ను కొన్ని మార్పులతో ఎలుకల్లో ప్రయోగించారు.
అది బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పని చేసింది. సాధారణ యాంటీ బయాటిక్స్‌ను ఎక్కువగా వినియోగిస్తే ఈ-కొలి, న్యూమోనియా, ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందుకే అన్ని బ్యాక్టీరియాలకు ఒకే మెడిసిన్‌ను రూపొందించాలని ఇల్లినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రయోగాలను చేశారు. వారి ఫలితాల వివరాలను తాజాగా సైన్స్ జర్నల్ ACS ప్రచురించింది. డెబియా -1452 ఇప్పటికే రెండో ఫేస్ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. అంటువ్యాధులను నివారించడంలో ఈ డెబియా కీలకపాత్ర పోషించనున్నట్టు వెల్లడించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire