Smallest Countries: ప్ర‌పంచంలో ఈ 5 దేశాలు చాలా చిన్న దేశాలు.. జ‌నాభా చాలా త‌క్కువ‌..

These 5 Countries are the Smallest Countries in the World the Population is Very Small
x

ప్రపంచంలో 5 అతిచిన్న దేశాలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Smallest Countries: పెద్ద దేశాల‌లో లేని సౌక‌ర్యాలు చిన్న దేశాల‌లో ఉంటాయి.

Smallest Countries: ప్ర‌పంచంలో పెద్ద దేశాల‌తో పాటు చిన్న దేశాలు కూడా ఉన్నాయి. కానీ పెద్ద దేశాల‌లో లేని సౌక‌ర్యాలు చిన్న దేశాల‌లో ఉంటాయి. ఎందుకంటే అక్క‌డ జ‌నాబా త‌క్కువ. కాబట్టి అన్ని స‌మృద్ధిగా దొర‌కుతాయి. ఇంకో విష‌యం ఏంటంటే ప‌ర్యాట‌కంగా చాలా అంద‌మైన ప్ర‌దేశాల‌తో నిండి ఉంటాయి. మిగ‌తా దేశాల‌తో పోలిస్తే చాలా సుంద‌రంగా ఉంటాయి. ఒక్క‌సార ప్ర‌పంచంలోని ఐదు చిన్న దేశాల గురించి తెలుసుకుందాం.

1. వాటికన్ సిటీ

ఈ జాబితాలో మొద‌టి స్థానంలో ఉన్న దేశం వాటికన్ సిటీ. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. కేవలం 110 ఎకరాల భూమిలో విస్తరించి ఉంటుంది. దేశ జనాభా కేవలం 1000 మాత్రమే. కానీ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన నగరంగా విర‌జిల్లుతోంది. ఈ ప్రదేశం చారిత్రాత్మకంగా మైఖేలాంజెలో, లియోనార్డో డావిన్సీతో సహా ప్రపంచంలోని గొప్ప కళాకారులతో సంబంధం కలిగి ఉంది. ఈ దేశంలో సెయింట్ పీటర్స్ బసిలికా, సెయింట్ పీటర్స్ స్క్వేర్, వాటికన్ మ్యూజియంలు చూడ‌ద‌గిన ప్ర‌దేశాలు.

2. మొనాకో

మొనాకో, ప్రపంచంలో రెండో అతి చిన్న దేశం. కేవలం 499 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. కానీ మాటల్లో చెప్పలేనంత గొప్ప దేశం. మీరు దేశ సౌందర్యాన్ని చూసి అంద‌రు ఆశ్చర్యపోతారు. ఈ దేశం మోంటే కార్లో క్యాసినో , గ్రాండ్ ప్రిక్స్ మోటార్ రేసింగ్, ఈవెంట్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేశంలో చూడ‌ద‌గిన ప్ర‌దేశాలు మోంటే కార్లో క్యాసినో, మొనాకో కేథడ్రల్, మొనాకో ఓషనోగ్రాఫిక్ మ్యూజియం, పురాతన ఆటోమొబైల్ మ్యూజియం ఉన్నాయి.

3. నౌరు

ఈ దేశం ప్ర‌పంచంలో మూడో స్థానంలో ఉంటుంది. ఈ దేశం ఆహ్లాదకరమైన ద్వీపంగా పిలువబడింది. ఆస్ట్రేలియా తూర్పున ఉన్న, దేశంలోని జనాభా 13000 మంది మాత్ర‌మే. ఈ శాంతియుత దేశం అంద‌రికి దూరంగా ఉంటుంది. అనిబారే బే, సెంట్రల్ పీఠభూమి, జపనీస్ గన్స్, మొక్వా వెలో చూడ‌ద‌గిన ప్ర‌దేశాలుగా చెప్ప‌వ‌చ్చు.

4. తువాలు

తువాలు ప్రపంచంలో నాలుగో అతి చిన్న దేశం. గతంలో ఎల్లిస్ ఐలాండ్ అని పిలిచేవారు. ఈ ద్వీప దేశం సుమారు 11,000 మంది జనాభాను కలిగి ఉంది. రిమోట్‌నెస్ కారణంగా పర్యాటకానికి దూరంగా ఉంది. ఫునాఫుటి మెరైన్ కన్జర్వేటివ్ ఏరియా, తువాలు స్టాంప్ బ్యూరో చూడ‌ద‌గిన ప్ర‌దేశాలు.

5. శాన్ మారినో

శాన్ మారినో 61.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ప్ర‌పంచంలో ఐద చిన్న దేశం. ఈ దేశ జనాభా సుమారు 33000 మంది. శాన్ మారినో ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆర్థిక, పరిశ్రమ, సేవలు, పర్యాటక రంగాలపై ఆధారపడి ఉంటుంది. ఈ అందమైన దేశం ప్రధాన ఆకర్షణలు దాని క్లిఫ్-టాప్ ప్యాలెస్‌లు.

Show Full Article
Print Article
Next Story
More Stories