Zycov-D: డెల్టా వేరియంట్‌పై జైకోవ్ -డీ టీకా 66 శాతం ప్రభావవంతం

Zycov-D: డెల్టా వేరియంట్‌పై జైకోవ్ -డీ టీకా 66 శాతం ప్రభావవంతం
x
Highlights

* అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన డీసీజీఐ * ఏటా 10- 12 కోట్ల మోతాదుల టీకాలను ఉత్పత్తి చేయాలని టార్గెట్

Zycov-D: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ డెల్టా వేరియంట్‌పై జైకోవ్ -డీ వ్యాక్సిన్ ప్రభావంతంగా పని చేస్తుందని జైడస్ గ్రూప్స్ ఎండీ డాక్టర్ షర్విల్ పటేల్ తెలిపారు. వేరియంట్‌పై టీకా 66 శాతం ప్రభావంతంగా ఉన్నట్టు పేర్కొన్నారు. జైకోవ్-డీ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఆమోదం తెలిపింది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ కంపెనీ ఏటా 10 నుంచి 12 కోట్ల మోతాదుల టీకాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

కొత్త ఉత్పత్తి ప్లాంట్‌లో అక్టోబర్ నుంచి నెలకు కోటి వరకు వ్యాక్సిన్ల ఉత్పత్తిని చేయొచ్చని షర్విల్ పటేల్ పేర్కొన్నారు. టీకా ఫేజ్ -3 ట్రయల్స్ దేశవ్యాప్తంగా 28వేల మంది వాలంటీర్లపై పరీక్షించారని స్పష్టం చేశారు. ట్రయల్స్ మధ్యంతర ఫలితాల్లో ఆర్‌టీపీసీఆర్ పాజిటివ్ కేసుల్లో 66.6 శాతం సామర్థ్యాన్ని చూపిందన్నారు. ఈ టీకాను 12ఏళ్ల పై బడిన వారికి కూడా ఇవ్వనున్నారు. జైకోవ్ డీ టీకా ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ కాగా ఇది మూడు డోసుల టీకా.

Show Full Article
Print Article
Next Story
More Stories