Millionaires: పేరుకేమో కోట్లకు అధిపతులు వేసుకునేవేమో పాత బట్టలు.. ఇలా ఎందుకంటే ?

The Trend of Consuming Less has Become Popular Among Millionaires
x

Millionaires: పేరుకేమో కోట్లకు అధిపతులు వేసుకునేవేమో పాత బట్టలు.. ఇలా ఎందుకంటే ?

Highlights

Millionaires: ప్రతి ఒక్కరికీ కోటీశ్వరులు కావాలని కోరిక ఉంటుంది. కోటీశ్వరులు అయిన తర్వాత మనీ మేనేజ్ మెంట్ తెలియక పోతే మళ్లీ అదే స్థితి చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టదు.

Millionaires: ప్రతి ఒక్కరికీ కోటీశ్వరులు కావాలని కోరిక ఉంటుంది. కోటీశ్వరులు అయిన తర్వాత మనీ మేనేజ్ మెంట్ తెలియక పోతే మళ్లీ అదే స్థితి చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టదు. అందుకే ఆదాయానికి తగట్లుగా ఖర్చు పెట్టడం.. ఉన్నదాంట్లో విలాసవంతంగా జీవించడం నేర్చుకోవాలి. ఇక కోటీశ్వరులయ్యాం కదా అని ఆడంబరాలకు పోతే అంతే సంగతులు. ఇలా కొందరు కోట్లు ఉన్నా సింప్లిసిటీతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. ఆడంబర జీవితాన్ని పక్కనపెట్టి, తక్కువ ఖర్చుతో రోజును గడిపేస్తున్న వారి సంఖ్య ప్రస్తుత సమాజంలో పెరిగిపోతుంది.

షాంగ్ సావెడ్రా ఒక ప్రముఖ వ్యాపారవేత్త. హార్వర్డ్‌లో చదువుకున్నారు. పర్సనల్ ఫైనాన్స్ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. లాస్‌ ఏంజెలెస్‌కు చెందిన షాంగ్‌ దంపతులు మల్టీ మిలియనీర్లు. కానీ వారి జీవన విధానం చూస్తే వారికి అంత ఆస్తి ఉందని ఎవరూ అనుకోరు. ఫోర్ బెడ్ రూంలు ఉన్న ఇంటిని అద్దెకు తీసుకున్నారు 16 ఏళ్ల క్రితం నాటి కారునే ఇప్పటికీ వాడుతున్నారు. పిల్లలకు సెకండ్ హ్యాండ్ దుస్తులు, ఫేస్‌బుక్‌ వేదికగా అమ్మకానికి పెట్టిన బొమ్మలను ఇస్తారు. అయితే పిల్లల చదువు, పెట్టుబడులు, దాతృత్వ కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తున్నారు. షాంగ్ దంపతులకు న్యూయార్క్‌లో పెద్ద మొత్తంలో ఆస్తులున్నాయి.

అలాగే డెంటిస్ట్ రాబర్ట్‌ చిన్‌, జెస్సికా ఫారర్‌ జంట కూడా నెలకు లక్షల డాలర్లలో జీతాన్ని పొందుతున్నారు. ఇద్దరూ కలిసి ఒక కారును వాడుతుంటారు. లంచ్‌ కోసం తమ వెంట బాక్సులు తీసుకెళ్తుంటారు. కిరాణా సరకులు, దుస్తులన్నీ హోల్‌సేల్‌గానే కొనుగోలు చేస్తుంటారు. నెలలో ఒకటి రెండుసార్లు మాత్రమే బయట ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తుంటారు. లాస్ వెగాస్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. కావాలనుకున్నప్పుడు నచ్చినట్లుగా ఓ ఇంటిని కొనుగోలు చేసుకోవాలనుకుంటున్నారు. ఎర్లీ రిటైర్‌మెంట్‌కు ప్లాన్‌ చేసుకుంటున్న వీరు.. పెట్టుబడులు, పొదుపు నుంచి ఆదాయం పొందేలా లైఫ్ ప్లాన్ చేసుకుంటున్నారు.

అనీ కోలెది కూడా సేమ్ స్టోరీ. ఆమె ఒక రీసెర్చర్‌. పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్. డబ్బులను ఎలా పొదుపు చేయాలో మహిళలకు సూచనలు ఇస్తుంటారు. ఆమెకు ఒక మిలియన్ డాలర్లకుపైగా విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ తనకున్న కారును అమ్మేశారు. ఎప్పటికీ ఇంట్లో ఆహారానికే ఆమె ఓటు వేస్తారు. జుట్టును కూడా ఎక్కువగా పెరగనివ్వరు. ఏడాదికి మూడుసార్లు మాత్రమే దుస్తులు కొనుగోలు చేస్తారు. ఎక్కువగా సెకండ్ హ్యాండ్ దుస్తులనే వాడుతుంటారు. వెకేషన్‌కు వెళ్లినా.. ఉచితంగా ఎక్కడ స్విమ్మింగ్ చేసుకునే అవకాశం ఉంటే వెళ్లి వాటినే ఎంజాయ్ చేస్తుంటారట. విమాన ప్రయాణాల విషయంలో డిస్కౌంట్లు, ఆఫర్లను అస్సలు విడిచి పెట్టరు. ఇలా వీరంతా తమ స్థాయిని పట్టించుకోకుండా సింప్లిసిటీని మెయింటైన్ చేస్తూ ఆస్తులు కూడబెట్టి బంగారు భవిష్యతుకు బాటలు వేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories