Kenya Protests 2024 : కెన్యా పార్లమెంటుకు నిప్పు..తమ పౌరులను అలర్ట్ చేసిన భారత్
Kenya Protests 2024 : కెన్యా సర్కార్ ప్రకటించిన కొత్త పన్నుకు వ్యతిరేకంగా ఆదేశంలో ఆందోళనలు, నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. పార్లమెంటులోకి ప్రవేశించిన ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు.పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో తమ పౌరులను అలర్ట్ చేసింది భారత హై కమిషన్. హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది.
Kenya Protests 2024 : కెన్యా ప్రభుత్వం ప్రతిపాదించిన పన్ను పెంపునకు వ్యతిరేకంగా ఆదేశంలో హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. నైరోబీలో జరిగిన ఈ హింసలో 5 మంది మరణించారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ అలర్ల నేపథ్యంలో భారతదేశం తన పౌరులను అలర్ట్ చేసింది. ప్రభుత్వం ప్రతిపాదించిన పన్నుల పెంపుదలకు వ్యతిరేకంగా తూర్పు ఆఫ్రికా దేశంలో హింసాత్మక నిరసనల మధ్య, కెన్యాలోని తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని..అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని భారత హై కమిషన్ సూచించింది.
కాగా మంగళవారం వేలాది మంది ప్రజలు కెన్యా పార్లమెంట్‌పై దాడి చేసి నిప్పంటించారు. పార్లమెంటు భవనంలోకి ప్రవేశించిన ఆందోళనకారులు కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను పగులగొట్టారు. అక్కడితో ఆగకుండా వాటన్నింటిని ఒక్కదగ్గర వేసి నిప్పంటించారు. అంతకుముందు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించేందుకు యత్నించిన ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, లైవ్ బుల్లెట్లను ప్రయోగించారు.దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటనలో ఇద్దరు కెన్యా పౌరులు మరణించారు. దీంతో కోపంతో రగిలిపోయిన ఆందోళనకారులు పార్లమెంటు భవనంలోకి ప్రవేశించి రచ్చ రచ్చ చేశారు. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో మంగళవారం "హింస మరియు అరాచకత్వానికి" వ్యతిరేకంగా కఠినమైన వైఖరిని తీసుకుంటామని తెలిపారు.
భారత హైకమిషన్ సలహా జారీ:
కెన్యాలోని భారత కాన్సులేట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన ఒక సలహాలో "నిరసనలు మరియు హింసాత్మకంగా ప్రభావితమైన ప్రాంతాలకు వెళ్లకుండా ఉండండి" అని పేర్కొంది. "దయచేసి అప్‌డేట్‌ల కోసం స్థానిక వార్తలు, మిషన్ వెబ్‌సైట్ , సోషల్ మీడియా హ్యాండిల్‌లను ఫాలో అవ్వండి" అని పేర్కొంది.
ADVISORY FOR INDIAN NATIONALS IN KENYA
— India in Kenya (@IndiainKenya) June 25, 2024
In view of the prevailing tense situation, all Indians in Kenya are advised to exercise utmost caution, restrict non-essential movement and avoid the areas affected by the protests and violence till the situation clears up.
కెన్యా పార్లమెంట్ పన్ను పెంపును ప్రతిపాదిస్తూ వివాదాస్పద బిల్లును ఆమోదించిన తర్వాత కెన్యా రాజధాని నైరోబీ, దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో హింసాత్మక ఘర్షణలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. కెన్యా అధ్యక్షుడు రూటో 2022లో అధ్యక్షుడైన తర్వాత ప్రజలకు ద్రోహం చేశారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. పేదలను ఆదుకుంటామని రూటో హామీ ఇచ్చారని ఆందోళనకారులు ఆరోపించారు. పన్నులు పెంచకుండా, రుణాల ఖర్చు తగ్గకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆర్థిక బిల్లును పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire