UK Elections: ఓటమి దిశగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్... భారీ మెజారిటీతో అధికారంలోకి రానున్న లేబర్ పార్టీ

UK Elections: ఓటమి దిశగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్... భారీ మెజారిటీతో అధికారంలోకి రానున్న లేబర్ పార్టీ
x

UK Elections: ఓటమి దిశగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్... భారీ మెజారిటీతో అధికారంలోకి రానున్న లేబర్ పార్టీ

Highlights

UK Elections:యూకేలో గురువారం సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం ఫలితాలు వెల్లడవుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని రిషి సునాక్ నేత్రుత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి ఖాయం అనిపిస్తోంది.

UK Elections: యునైటెడ్ కింగ్‌డమ్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. అయితే, ఫలితాలకు ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని రిషి సునాక్ నేత్రుత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ నిష్క్రమణ దాదాపు ఖాయం అని కనిపిస్తోంది. ప్రధాన ఎగ్జిట్ పోల్ ప్రకారం, యూకే ఎన్నికల్లో సెంటర్-లెఫ్ట్ లేబర్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందబోతోంది. ఎన్నికల ఫలితాలు ఇలాగే ఉంటే, 14 ఏళ్ల తర్వాత యూకేలో లేబర్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది.

కాగా యూకే ఎన్నికల కోసం BBC, ITV, Sky, Ipsos ద్వారా ఎగ్జిట్ పోల్ డేటా విడుదలయ్యింది. ఇందులో లేబర్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని అంచనా. లేబర్ పార్టీ 410 సీట్లు గెలుస్తుందని... కన్జర్వేటివ్ పార్టీకి 131 సీట్లు మాత్రమే వస్తాయి తెలిపాయి. లిబరల్ డెమొక్రాట్‌లకు 61 సీట్లు, రిఫార్మ్ యూకేకి 13 సీట్లు, గ్రీన్ పార్టీకి 2 సీట్లు వస్తాయని అంచనా వేసాయి. అధికారం చేపట్టేందుకు 326 సీట్లు కావాల్సి ఉంటుంది.

కన్జర్వేటివ్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ రాజకీయ భవితవ్యాన్ని తేల్చే సార్వత్రిక ఎన్నికలుగా వీటిని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లేబర్ పార్టీ తరపున కీర్ స్టార్మర్ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో స్టార్మల్ ఎక్స్ వేదికగా స్పందించారు. మార్పు చెందిన లేబర్ పార్టీపై నమ్మకం ఉంచిన కార్యకర్తలు, ఓటర్లకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడిన వెంటనే రిషి సునాక్ కూడా ఓటర్లు, పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చే అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని సునాక్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. మరోవైపు తరచూ ప్రధానులు మారే అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని స్టార్మర్ ఓటర్లకు విజ్నప్తి చేశారు. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం కోసం 326 స్థానాలు గెలుపొందాల్సి ఉంటుంది. రెండు ప్రధాన పార్టీలతో పాటు లిబరల్ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, ఎస్ డీఎల్ పీ, డెమోక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ, షిన్ ఫీన్, ప్లయిట్ కమ్రి, వర్కర్స్ పార్టీ, యాంటీ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ పార్టీతోపాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో దిగారు.

కాగా UKలో, జూలై 4న, పార్లమెంటులోని 650 స్థానాలకు అంటే హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఓటింగ్ జరిగింది. దాని ఫలితాలు ఈరోజు వెల్లడి అవుతున్నాయి. పార్లమెంట్‌లో మెజారిటీ సంఖ్య 326. ఈ సంఖ్యను ఏ పార్టీ లేదా కూటమి దాటితే అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం లేబర్ పార్టీకే మెజారిటీ కంటే ఎక్కువ సీట్లు సులభంగా వస్తాయని అంచనా.

Show Full Article
Print Article
Next Story
More Stories