China Sandstorm: దశాబ్దంలోనే అతిపెద్ద ఇసుక తుఫాన్‌

The Biggest Sandstorm in the Decade in china
x

చైనా ఇసుక తుఫాన్ (ఫైల్ ఫోటో)

Highlights

China Sandstorm: బీజింగ్‌ సహా ఉత్తర చైనాలోని 12 రాష్ట్రాలపై ఎఫెక్ట్‌ * గాలి దుమారంతో తలెత్తిన ట్రాఫిక్‌ సమస్యలు

China Sandstorm: చైనాలో ఇసుక తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. గాలి దుమారం వల్ల సమీపంలోని భవనాలు, రోడ్డుపై వచ్చేవాహనాలు కనిపించకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.

రాజధాని బీజింగ్ సహా ఉత్తర చైనాలోని 12 రాష్ట్రాలపై తుఫాన్‌ ప్రభావం చూపినట్టు అంచనా వేశారు. ప్రభావిత ప్రాంతాల్లో యెల్లో అలర్ట్‌ జారీ చేశారు. దక్షిణ మంగోలియాలోని గోబి ఎడారిలో ఈ ఇసుక తుఫాన్‌ ప్రారంభమైనట్టు జాతీయ వాతారణ కేంద్రం తెలియజేసింది. గత దశాబ్దకాలంలో ఇదే అత్యంత తీవ్రమైన ఇసుక తుఫాన్‌గా అభివర్ణించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories