Bangladesh: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్మీ కసరత్తు

The army is working to establish a caretaker government in Bangladesh
x

Bangladesh: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్మీ కసరత్తు

Highlights

Bangladesh: బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ నివాసంలో అన్ని పార్టీల నేతలతో సమావేశం

Bangladesh: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్మీ కసరత్తు చేస్తుంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ నివాసంలో అన్ని పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ప్రధాని రేసులో నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్, మాజీ ప్రధాని ఖలెదా జియా, ఆర్మీ చీఫ్ వాకర్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహమ్మద్‌ యూనస్‌ వైపు విద్యార్థి సంఘాలు మొగ్గు చూపుతున్నాయి. 24 గంటల డెడ్‌లైన్‌ విధించారు. సాయంత్రంలోగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌లో మాత్రం ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. హిందూ ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులు కొనసాగుతున్నాయి. బంగ్లాలోని 27 జిల్లాల్లో హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. బెంగాల్‌, త్రిపుర గుండా వలసలు మొదలయ్యాయి.

బంగ్లాదేశ్ ఆందోళనలు అమెరికాను తాకాయి. న్యూయార్క్‌లోని బంగ్లాదేశ్‌ కాన్సులేట్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. కాన్సులేట్‌ కార్యాలయంలోని షేక్‌ హసీనాతోపాటు.. ముజుబుర్‌ రెహ్మాన్‌ ఫొటోలను ఆందోళనకారులు తొలగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories