*తాజాగా హ్యూమనాయిడ్ రోబోను ప్రదర్శించి ఆశ్చర్యపరచిన ఎలాన్ మస్క్
Elon Musk: మనిషి ఆలోచనకు.. ఆవిష్కరణలకు ఆకాశమే హద్దు. తక్కువ కాలంలో ఎక్కువ పని చేసేందుకు యంత్రాల సాయం తీసుకున్న మనిషి... ఆ తరువాత.. రోబోల తయారీకి శ్రీకారం చుట్టాడు. ఆ రోబోలు.. మనిషి ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తాయి. అయితే స్వయంగా మనిషిలా ఆలోచించే.. మరమనిషి విషయంలో విషయంలో మాత్రం అసంతృప్తి ఉండేది. ఇప్పుడు ఆ లోటును పూడ్చే మరమనిషిని ఎలక్ట్రానిక్ కార్ల సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆవిష్కరించారు. ఆర్టిఫీషియల్ డే సందర్భంగా.. మరమనిషిని అందరి ముందుకు తెచ్చి ఆశ్చర్యపరిచారు. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో హెడ్‌క్వార్టర్స్‌లో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో హ్యూమనాయిడ్ రోబో అలరించింది. ఇది ఆరంభం మాత్రమేనని.. త్వరలో సెక్సీ మర మనుషులను సృష్టిస్తామంటూ ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశాడు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనిషి అద్భుతాలను సృష్టిస్తున్నాడు. మనిషికి సాధ్యపడని ఎన్నో పనుల కోసం.. మిషన్ల సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చినవే రోబోలు. రజినీకాంత్ నటించిన రోబో సినిమాలో చిట్టి చేసే విన్యాసాలు... ప్రేక్షకులను మైమరపించింది. చిట్టిలాగే సొంతంగా నిర్ణయాలు తీసుకునే రోబోలను అసలు మనిషి తయారుచేయగలడా? అన్న సందేహం కూడా ఉండేది. కానీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్-ఏఐ అందుబాటులోకి రావడంతో మర మనుషుల్లో మార్పు వచ్చింది. మాట్లాడే రోబోల తయారీపై పలు కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ రోబోటిక్ టెక్నాలజీని అధికంగా జపాన్ వినియోగిస్తోంది. అయితే స్వయంగా ఆలోచించి.. నిర్ణయాలు తీసుకునే మర మనిషిని సృష్టిస్తామంటూ 5 నెలల క్రితం ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. మనిషిలా ప్రవర్తించే రోబోలను హ్యుమనాయిడ్ రోబోలు అంటారు. ఆర్టిఫిషియల్ డే సందర్భంగా మనిషిలా ఆలోచించే హ్యుమనాయిడ్ రోబోను ప్రదర్శించి.. ఎలాన్ మస్క్ సంచలనం సృష్టించారు. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హ్యుమనాయిడ్ రోబో అలరించింది.
మనిషి తరహా రోబోలు ఎన్నో ఇప్పటిదాకా వచ్చాయి. అయితే అవి ఆలోచన సామర్థ్యానికి దూరంగా ఉన్నాయని బిలియనీర్ ఎలాన్ మస్క్ భావించేవారు. టెస్లా ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మాట్లాడే రోబోలను తయారీకి శ్రీకారం చుట్టారు. తాజాగా ఆ హ్యూమనాయిడ్ రోబోతో ఎలాన్ మస్క్ ఎంట్రీ ఇచ్చారు. ఆ రోబోకు ఆప్టిమస్ అనే పేరును కూడా ఎలాన్ పెట్టారు. అందరికీ ఆ యంత్రుడు అభివాదం చేసి.. ఫోజులు కూడా ఇచ్చాడు. ఇక మొక్కలకు నీళ్లు పోయడం, బాక్సులను మోయడం లాంటి పనులను చేసిన రోబో వీడియోను ఎలాన్ మస్క్ ప్రదర్శించారు. అయితే చివర్లో రోబో తడబడడం, ఇంజినీర్లు వచ్చి.. దానిని సరిచేయడం ట్రోలింగ్‌కు దారి తీసింది. ఆప్టిమస్ ఒకవేళ తడబడినా... అది ఒక లోపమేతప్ప మరేమీ కాదు.. దీని ద్వారా మనిషిలా ఆలోచించే మర మనుషుల రాకకు మరెంతో దూరం లేదని మాత్రం ఎలాన్ మస్క్ నిరూపించారు. అంతేకాదు... ఈ రోబోల విషయంలో ఎలాన్ మస్క్ ఐదు నెలల క్రితం సంచలన ప్రకటన కూడా చేశారు. దీంతో చర్చంతా ఆప్టిమస్‌పై కాకుండా... అప్పటి ఎలాన్ మస్క్ ప్రకటనపైనే సాగుతోంది. ఇంతకు ఎలాన్ మస్క్ చేసిన ఆ ప్రకటన ఏంటి? ఎలాంటి రోబోలు రాబోతున్నాయని సంకేతాలు ఇచ్చారు?
తర్వలోనే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడిన సెక్సీ రోబోలను తయారుచేస్తామంటూ ఏప్రిల్‌లోనే ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ఆప్టిమస్ రోబో వెర్షన్‌లోనే క్యాట్‌గర్ల్ వెర్షన్ రాబోతుందని అప్పట్లో హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆప్టిమస్ రావడంతో... ఎలాన్ మస్క్ అనుకున్నంత పని చేస్తాడా? అంటూ ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలు టెస్లా తయారుచేసే ఆప్టిమస్ క్యాట్ గర్ల్ వెర్షన్ ఎలా ఉండబోతోంది? అంటూ టెక్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టెస్లా రూపొందిస్తున్న ఈ ఆప్టిమస్ రోబోలు అందుబాటులోకి రావడానికి మరో రెండు నుంచి ఐదేళ్లు పట్టే అవకాశం ఉంది. టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐతోనే ఈ రోబోలు తయారుకాబోతున్నాయి. ఈ రోబోలను 20వేల డాలర్లలోపే విక్రయించేలా రూపొందిస్తామని ఎలాన్ మస్క్ అప్పట్లోనే ప్రకటించారు. అంటే మన రూపాయల్లో అయితే.. 16 లక్షలు పలికే అవకాశం ఉంది. అయితే అందరి దృష్టి అప్టిమస్ క్యాట్ గర్ల్ రోబోపైనే నెలకొన్నది. ఈ రోబో ఎలా ఉండబోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. మగాడి అవసరాలను తీర్చేలా ఉంటుందా? లేక కేవలం ప్రేమను పంచుతుందా? అంటూ పలువురిలో ఆసక్తి రేపుతోంది.
ఎలాన్ మస్క్ మాత్రం.. రోబోలు శృంగార భాగస్వాములుగా మారడం బహుశా అనివార్యం అంటూ వ్యాఖ్యలు చేశారు. క్యాట్ గర్ల్ తరహాలో రోబోలను తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అప్పటి వ్యాఖ్యలకు కొనసాగింపుగా.. తాజాగా క్యాట్ గర్ల్ వర్షన్ కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. 2024 చివరి నాటికి ఈ సెక్సీ వెర్షన్ రోబోలను మార్కెట్లోకి తేవాలనే ఆలోచనతో మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు. మార్స్ నుంచి మంకీ వరకూ మస్క్ నిత్యం కొత్త విషయం చెబుతూ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు. చాలా సందర్భాల్లో షాకింగ్ విషయాలు చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం న్యూట్రాలింక్ కార్పొరేషన్ అనే కంపెనీతో టై-అప్ అయ్యారు. ఈ కంపెనీ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ తయారుచేస్తోంది. అంటే... మన మెదడులోనే ఓ చిప్ పెట్టి... దాని ద్వారా పనులు చేసుకోవడం అన్నమాట. అందులో భాగంగానే తాము ఓ కోతి మెదడులో వైర్లతో ఓ చిప్ అమర్చి.. దాన్ని పాటలు వినేలా, వీడియో గేమ్స్ ఆడేలా చేశారు.
ఇక 20 ఏళ్ల కిందట రోబోలంటే... ఇళ్లలో పనిచేసే పనిమనుషులు మాత్రమే. ఇప్పుడు అలా కాదు... రోబోల పరిధి చాలా మారింది. అవి పరిశ్రమల్లో అన్ని రకాల పనులూ చేసేస్తున్నాయి. పెంపుడు జంతువులు చేసే పనులన్నీ రోబోలు చేసేస్తున్నాయి. మనుషులతో అవసరం లేకుండా... అన్ని పనులూ చేసేయడానికి వీలయ్యేలా హ్యూమనాయిడ్ రోబోలను పలు కంపెనీలు అభివృద్ధి చేస్తున్నాయి. అందుకు కృత్రిమ మేథస్సు బాగా ఉపయోగపడుతోంది. ఈ రోబో విప్లవం మనకు ఇబ్బందికరమే అయినప్పటికీ... కాలానుగుణంగా మార్పు తప్పదంటున్నారు నిపుణులు. ఒకప్పుడు సరిగా నడవడమే కష్టమైన రోబోలు... ఇప్పుడు పిల్లిమొగ్గలు వేస్తున్నాయి. డాన్స్ చేస్తున్నాయి. ఒంటి కాలితో గెంతుతున్నాయి. యుద్ధంలోకి కూడా దిగనున్నాయి. దీంతో రోబో చేయనిదంటూ ఏమీ లేదన్నట్టుగా మారాయి. వాటి ధర ఇంకా తగ్గితే రోబో విప్లవం రావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా భూమిపై మనిషిలాగే ప్రవర్తించడానికి.. పని చేయడానికి మరో రెండేళ్లలో రోబోలు రానున్నాయి. వాటితో ఎన్ని లాభాలు ఉంటాయో.. ఎన్ని నష్టాలు వాటిల్లుతాయో వేచి చూడాల్సిందే.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire