ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్ధుల గోస.. పిల్లల కోసం తల్లిదండ్రుల ఆందోళన

Telugu Students in Ukraine Coming India Today | Russia Ukraine War | Breaking News
x

ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్ధుల గోస.. పిల్లల కోసం తల్లిదండ్రుల ఆందోళన

Highlights

Ukraine Telugu Students: భారతీయులు సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని రాయబార కార్యాలయం సూచించింది...

Ukraine Telugu Students: ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయ విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే వారిని ఉక్రెయిన్ సరిహద్దులు దాటించాలనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా హంగేరీ, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్, రొమేనియాలో నాలుగు ప్రదేశాలను గుర్తించింది. అయితే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువ మంది ఉక్రెయిన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్‌, పోలాండ్ సరిహద్దుకు భారత విద్యార్థుల బృందం చేరుకున్నట్లు సమాచారం. విద్యార్థులను ప్రత్యేక బస్సులో సరిహద్దుకు తరలిస్తున్నారు. బోర్డర్ పాయింట్‌ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో బస్సులో వారిని దింపారు. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం సలహా జారీ చేసింది. భారతీయులు సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని రాయబార కార్యాలయం సూచించింది.

ఉక్రెయిన్‌లోని భారతీయులకు రాయబార కార్యాలయం నిరంతరం సహాయం చేస్తోంది. రొమేనియా, హంగేరీ మీదుగా భారతీయులను తిరిగి భారత్‌ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఇక విద్యార్థులతో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఢిల్లీ చేరుకోనుంది ప్రత్యేక విమానం.

Show Full Article
Print Article
Next Story
More Stories