అమెరికాలో మాట్లాడే భాషల్లో 11వ స్థానంలో తెలుగు... 12. 3 లక్షలకు చేరిన తెలుగువారి జనాభా

Telugu Population Touch 12.3 Lakh in USA
x

అమెరికాలో మాట్లాడే భాషల్లో 11వ స్థానంలో తెలుగు... 12. 3 లక్షలకు చేరిన తెలుగువారి జనాభా

Highlights

అమెరికాలో మాట్లాడే భాషల్లో 11వ స్థానంలో తెలుగు... 12. 3 లక్షలకు చేరిన తెలుగువారి జనాభా

తెలుగు మాట్లాడేవారి సంఖ్య అమెరికాలో రోజు రోజుకు పెరుగుతుంది. అగ్రరాజ్యంలో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో నిలిచింది. యుఎస్ సెన్సెస్ బ్యూరో డేటా ఈ విషయాన్ని ప్రకటించింది. గత కొన్నేళ్ళుగా అమెరికాలో తెలుగువారి జనాభా పెరిగిపోతోందనడానికి ఈ డేటా నిదర్శనంగా నిలిచింది.


అమెరికాలో 12. 3 లక్షలకు చేరిన తెలుగు జనాభా

అమెరికాలో తెలుగు మాట్లాడే జనాభా ప్రతి ఏటా పెరుగుతుంది. 2016లో 3.2 లక్షలుగా ఉన్న తెలుగువారి జనాభా 2024 నాటికి 12.3 లక్షలకు చేరింది. యుఎస్ లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లే వారిలో ఎక్కువగా తెలుగు విద్యార్ధులుంటున్నారు. వీరితో పాటు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసేందుకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.

ప్రతి ఏటా 60 నుండి 70 వేల మంది విద్యార్ధులు అమెరికాకు వస్తారు. వీరిలో 10 వేల మంది హెచ్ 1 బీ వీసాతో ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా ఉంటారని నివేదికలు చెబుతున్నాయి. అమెరికాలోని డల్లాస్, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడాలల్లో తెలుగు వారు నివసిస్తున్నారు.

అమెరికాలో భారతీయ విద్యార్ధుల్లో 12 శాతం తెలుగు విద్యార్థులు

తెలుగు విద్యార్థులు ఎక్కువగా అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్తున్నారు. ఇండియన్ మొబిలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం యూఎస్ భారతీయ విద్యార్ధుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల్లో తెలుగువారి సంఖ్య 12.5 శాతమని గణాంకాలు చెబుతున్నాయి. మాస్టర్స్ చదివేందుకు అమెరికాకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతోంది.


అమెరికాలో మాట్లాడే భారతీయ భాషల్లో గుజరాతీ, హిందీ టాప్

అమెరికాలో మాట్లాడే విదేశీ భాషల్లో ఇండియాకు చెందిన హిందీ, గుజరాతీ భాషలు టాప్ లో ఉన్నాయి. అమెరికాలో నివసించే భారతీయుల్లో హిందీ, గుజరాతీ భాషలు మాట్లాడేవారు ఎక్కువ. దీంతో ఈ భాషలు మూడో స్థానంలో నిలిచాయి. పాత తరంలో అమెరికాకు ఎక్కువగా పారిశ్రామికవేత్తలు వెళ్లేవారు. కానీ, ప్రస్తుతం ఐటీ, ఫైనాన్స్ రంగంలో భారతీయులు ఎక్కువగా ఉంటున్నారు.

అమెరికాలో తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలు

అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన వారిలో కొందరు అక్కడే ఉద్యోగం కూడ సంపాదిస్తున్నారు. కొంత కాలం ఉద్యోగం చేసి స్వదేశానికి తిరిగి వచ్చే వారు కొందరైతే మరికొందరు అమెరికాలో స్థిరపడేవారున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసే వారిలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు.


అమెరికాలో పెరుగుతున్న తెలుగువారి జనాభాను చూస్తుంటే కొంత కాలానికి హైదరాబాద్‌లో ఉన్నా అమెరికాలో ఉన్నా పెద్దగా తేడా తెలియిని పరిస్థితులు వచ్చేస్తాయేమో! ఇప్పటికే, తెలుగువారు విద్యార్థులుగానే కాకుండా కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థానాలను అందుకోవడం చాలా మందికి ప్రేరణ ఇస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories