Syria Civil War: డెమాస్కస్ ను ఆక్రమించిన తిరుగుబాటుదారులు..దేశం విచిచి పారిపోయిన సిరియా అధ్యక్షుడు

Syria Civil War: డెమాస్కస్ ను ఆక్రమించిన తిరుగుబాటుదారులు..దేశం విచిచి పారిపోయిన సిరియా అధ్యక్షుడు
x
Highlights

Syria Civil War: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచిపారిపోయారు. నేపథ్యంలో తిరుగుబాటుదారులు అనేక పెద్ద నగరాలను...

Syria Civil War: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచిపారిపోయారు. నేపథ్యంలో తిరుగుబాటుదారులు అనేక పెద్ద నగరాలను స్వాధీనం చేసుకున్నారు. సిరియాలో వేగంగా పురోగమిస్తున్న తిరుగుబాటుదారులు తాము రాజధాని డమాస్కస్‌ శివార్లకు చేరుకున్నారు.అధ్యక్షుడు బసర్ అల్-అస్సాద్ దేశం విడిచి వెళ్లినట్లు సోషల్ మీడియాలో వ్యాపించిన పుకార్లను సిరియా ప్రభుత్వ మీడియా ఖండించింది. అసద్ ఇప్పటికీ రాజధాని డమాస్కస్‌లో తన విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది. ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTS)కి చెందిన తిరుగుబాటుదారులు ఆదివారం సిరియాలో తమ విజయాన్ని ప్రకటించారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన హోమ్స్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.

2018 తర్వాత రాజధాని సమీపంలోకి తిరుగుబాటుదారులు చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు అసద్ రాజధానిని విడిచి పారిపోయారు. విమానంలో గుర్తుతెలియని ప్రాంతాలని వెళ్లినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఆయన రష్యాకు పారిపోయినట్లు వార్తలను ప్రభుత్వ దళాలను ఖండించాయి.

ఉత్తర సిరియాపై హయాత్ తహరీర్ అల్ షామ్ నేతృత్వంలోని తిరుగుబాటుదళాలు పట్టుబిగిస్తుంటే దక్షిణ సిరియాలోని పరిస్థితి కూడా అసద్ వ్యతిరేకంగా మారడంతో కీలకనగరమైన దారాతోపాటు స్వీడియా తదితర ప్రాంతాల నుంచి సిరియా సైన్యాలు శనివారం వైదొలగడం వల్ల అవి తిరుగుబాటుదారుల వశం అయ్యాయి. ఇక డెమాస్కస్ శివారు ప్రాంతాలైన మదామియా, జరామానా, దరాయాల్లో తిరుగుబాటుదారుల కదలికలు కనిపిస్తున్నాయని పలు మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.

2011లో దారా నగరం నుంచి అసద్ కు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత అది అంతర్యుద్ధంగా మారింది. దారాలోని 90శాతం భూభాగం స్థానిక తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లింది. దారాకు 50 కిలోమీటర్ల దూరంలోని సువైదా నుంచి కూడా ప్రభుత్వ దళాలు అక్కడి నుంచి పారిపోయాయి. ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన మైనార్టీ డ్రూజ్ తెగ మిలిటెంట్లు డెమాస్కస్ దిశగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమిస్తారనే భయంతోనే డెమాస్కస్ లోని వేలాది మంది పౌరులు లెబనాన్ సరిహద్దులకు చేరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories