Suez Canal: ఎవర్ గ్రీన్ కంటైనర్ షిప్‌కు లైన్ క్లియర్ అయిందా?

Suez Chief Osama Rabie Says Human Error in Ship Grounding
x

Suez Canal: ఎవర్ గ్రీన్ కంటైనర్ షిప్‌కు లైన్ క్లియర్ అయిందా?

Highlights

Suez Canal: ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సూయజ్ సంక్షోభానికి తెర పడనుందా? కెనాల్‌లో అడ్డం తిరిగిన రాకాసి నౌకలో కదలిక వచ్చిందా?

Suez Canal: ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సూయజ్ సంక్షోభానికి తెర పడనుందా? కెనాల్‌లో అడ్డం తిరిగిన రాకాసి నౌకలో కదలిక వచ్చిందా? కంటైనర్ షిప్ రెస్కూ ఆపరేషన్‌పై సూయజ్ కెనాల్ చీఫ్ ఏమంటున్నారు?

సూయజ్ కాల్వలో ఆరు రోజులుగా ఇరుక్కుపోయిన ఎవర్ గ్రీన్ కంటైనర్ ఎట్టకేలకు కదిలింది. ఇన్ని రోజులుగా టగ్ బోట్లు, డ్రెడ్జర్లతో సూయజ్ పోర్టు అధికారులు ప్రయత్నిస్తుండడంతో అది 29 మీటర్లు పక్కకు కదిలింది. మంగళవారం నుంచి షిప్‌ను సాధారణ స్థితికి తెచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించిన అధికారులు ఒడ్డున ఉన్న మట్టిని, ఇసుకను తవ్వుతూ ఎవర్ గ్రీన్ కు లైన్ ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు.

మరోవైపు భారీ గాలులు పెరగడం, అలలు తీవ్రత ఎక్కువకావడం వంటి కారణాలతో ఎవర్ గ్రీన్ షిప్పు పక్కకు జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నౌక ప్రొపెల్లర్, రడ్డర్లను బురద నుంచి తొలగించినట్టు చెప్పారు. కాగా, మానవ తప్పిదం వల్లే ఎవర్ గ్రీన్ నౌక ఇలా ఒడ్డుకు వచ్చి ఆగిపోయి ఉంటుందని సూయజ్ కాల్వ చైర్మన్ జనరల్ ఒసామా రబీ అన్నారు. కాగా మంగళవారం నుంచీ ఇప్పటివరకూ సూయజ్ కెనాల్‌లో దాదాపు 350 నౌకలు జామ్ అయినట్లు అధికారులు తెలిపారు. అటు నష్ట తీవ్రత కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రతిరోజూ దాదాపు 70 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది.

ఇక రోజురోజుకూ సూయజ్‌లో ట్రాఫిక్ పెరిగిపోతుండడంతో వీలైనంత త్వరగా షిప్‌ను కదిలించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. ప్రస్తుతం సిబ్బంది నౌక కిందకు వెళ్లి మరీ దానిని పక్కకు తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తొందరగానే షిప్పును పక్కకు తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories