సుయెల్లా బ్రెవర్మన్‌ బ్యాక్‌.. రిషి సునక్‌ కేబినెట్‌లో మళ్లీ హోంశాఖ

Suella Braverman was Reappointed Home Secretary by Rishi Sunak
x

సుయెల్లా బ్రెవర్మన్‌ బ్యాక్‌.. రిషి సునక్‌ కేబినెట్‌లో మళ్లీ హోంశాఖ

Highlights

Suella Braverman: సుయెల్లాను మళ్లీ తీసుకోవడంపై లేబర్‌ పార్టీ విమర్శలు

Suella Braverman: భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్‌ ఎంపీ సుయెల్లా బ్రేవర్మన్‌కు మళ్లీ బ్రిటన్‌ హోం మంత్రి పదవికి దక్కింది. రెండు సార్లు డేటా ఉల్లంఘనలకు పాల్పడిన ఆమె.. లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వం నుంచి ఆరు రోజుల క్రితం తప్పకున్నారు. కొత్త ప్రధాని రిషి సునాక్‌ కేబినెట్‌లో ఆమెకు మళ్లీ హోంమంత్రి పదవే దక్కింది. వివాదాస్పద వ్యక్తికి మళ్లీ పదవిని కట్టబెట్టడంపై ఇప్పుడు బ్రిటన్‌లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రధాని రిషి సునక్‌పై ప్రతిపక్ష లేబర్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తప్పు చేసినట్టు అంగీకరించిన వ్యక్తి మంత్రి పదవిని ఎలా కట్టబెడుతారంటూ నిలదీస్తున్నారు. రెండు సార్లు డేటా ఉల్లంఘనలకు పాల్పడినట్లు కొన్ని రోజుల క్రితమే బ్రెవర్మాన్‌ అంగీకరించారు. చేసిన తప్పుకు ప్రాయశ్చితంగానే రాజీనామా చేస్తున్నట్టు.. బ్రెవర్మన్‌ తెలిపారు. అంతేకాదు.. లిజ్ ట్రస్‌ పన్ను రాయితీపైనా నిప్పులు చెరిగారు.

సుయెల్లా బ్రెవర్మన్‌కు ఎందుకు అంత ప్రియార్టీ ఇస్తున్నారో అర్థం కావడం లేదని 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ మాజీ చీఫ్‌ గెవిన్‌ వార్‌వెల్‌ ఆరోపించారు. బ్రెవర్మాన్‌ను మంత్రిగా నియమించడం సునాక్‌ ఇమెజ్‌కు దెబ్బేనని బార్‌వెల్‌ వ్యాఖ్యానించారు. కన్జర్వేటివ్‌ పార్టీ గబ్బు రాజకీయాలకు పాల్పడుతోందని, అందుకే బ్రెవర్మాన్‌కు మళ్లీ హోంశాఖ అప్పగించినట్లు లేబర్‌ పార్టీ నేత బ్రిడ్జెట్‌ ఫిలిప్సన్‌ ఆరోపించారు. రిషి ప్రధాని అయ్యేందుకు ఓ డర్టీ డీల్‌ జరిగినట్లు ఆమె విమర్శించారు. సమగ్ర ప్రభుత్వాన్ని నడుపుతానన్న సునాక్‌ మాటల్ని విశ్వసించలేమని ఆమె ఆరోపించారు. దేశ భవిష్యత్తు గురించి చర్చించాలని, కానీ కన్జర్వేటివ్‌ పార్టీ భవిష్యత్తు కాదు అని ఆమె అన్నారు. విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ మాత్రం సునాక్‌ నిర్ణయాన్ని సమర్థించారు. హోంమంత్రిగా బ్రెవర్మాన్‌ను మళ్లీ నియమించడం పట్ల క్లెవర్లీ సంతోషం వ్యక్తం చేశారు. తప్పు చేసినట్లు ఒప్పుకున్న ఆమె, ఆ తప్పును అంగీకరించారని జేమ్స్‌ తెలిపారు. బ్రెవర్మాన్‌ చాలా కఠినంగా నేరాలను అదుపు చేశారన్నారు.

ఇటీవల సుయెల్లా భారత్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంటే బ్రిటన్‌కు వలసలు భారీగా పెరుగుతాయంటూ బ్రేవర్మన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. వీసా కాలపరిమితి ముగిసినా చాలా మంది భారతీయులు ఇంకా బ్రిటన్‌లోనే ఉండిపోయారంటూ ఆరోపించారు. వీసా కాలపరిమితి ముగిసినా బ్రిటన్‌లో ఉంటున్నవారిలో భారతీయులే అత్యధికులంటూ నోరు పారేసుకున్నారు. అంతేకాదు భారత్‌తో ఓపెన్‌ బార్డర్‌ మైగ్రేషన్‌ పాలసీతో బ్రిటన్‌కు నష్టమేనంటూ తన అక్కసును వెల్లగక్కారు. భారత్‌తో చేసుకున్న ఒప్పందాలతో యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు ఎలాంటి ప్రయోజనం లేదంటూ విమర్శలు గుప్పించారు. బ్రిగ్జిట్‌ కోసం బ్రిటన్‌ ప్రజలు ఓటేసింది. భారత్‌ వలసలు ప్రోత్సహించడానికా? అంటూ మండిపడ్డారు. గతంలో సుయెల్లా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌ పాలించిన వలస దేశాల్లో న్యాయవ్యవస్థ, సైన్యం, పౌరసేవలు, మౌలిక వసతులు ఉన్నాయంటే అందుకు బ్రిటన్‌ రాచరికపు చలవే అంటూ సెలవచ్చారు.

సుయేలా కాంమెంట్స్‌తో భారత్‌ షాక్‌ అయ్యింది. ఓపెన్‌ బార్డర్‌ మైగ్రేషన్‌ పాలసీ ఒప్పందం రద్దయ్యే అవకాశముందన్న వాదనలు కూడా వినిపించాయి. ఆమె మళ్లీ హోంమంత్రి కావడంతో బ్రిటన్‌తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రేవర్మన్‌ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా భారత్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయి. సుయేల్లా బ్రేవర్మన్‌ వ్యాఖ్యలపై భారత్‌ ఘాటుగానే స్పందించింది. బాధ్యతాయుతమైన హోం మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటంటూ మండిపడింది. బ్రేవర్మన్‌ వ్యాఖ్యలను అప్పట్లో బ్రిటన్‌లోని భారత హైకమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. భారత్‌ పర్యటన నిమిత్తం వీసాల కోసం దరఖాస్తు చేసుకునే బ్రిటన్‌ పౌరులు వీసా కేంద్రాలకు స్వయంగా హాజరు కావాలని తేల్చి చెప్పింది. ఏజెంట్లు వస్తే వీసాలు మంజూరు చేయమంటూ స్పష్టం చేసింది. ఆమె వ్యాఖ్యలపై అప్పటి ప్రధాని లిజ్‌ ట్రస్‌ వివరణ ఇచ్చుకున్నారు. ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమంటూ పేర్కొన్నారు. భారత్‌తో డీల్‌ కుదుర్చుకునేందుకు తాము ఎదురుచూస్తున్నామని లిజ్‌ ట్రస్‌ చెప్పారు. ఇప్పడు రిషి సునక్‌ ఈ డీల్‌పై ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories