Sri Lanka: లంక అధ్యక్షుడు గొటబాయ పరారీ?

Sri Lanka President Gotabaya Rajapaksa Flees as Protesters Storm Residence
x

Sri Lanka: లంక అధ్యక్షుడు గొటబాయ పరారీ?

Highlights

Sri Lanka: కొలంబోలో రాజపక్సే ఇంటిని... ముట్టడించిన వేలాది మంది ఆందోళనకారులు

Sri Lanka: సంక్షోభ శ్రీలంకలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. వాణిజ్య రాజధాని కొలంబోలో వేలాదిమంది గ్యాస్‌ నిరసనకారు వీధుల్లోకి వచ్చారు. భారీ ర్యాలీగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఇంటి వైపు వెళ్లారు. ఆందోళనకారులపై లంక పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. అయినా వారు గొటబాయ ఇంటివైపు దూసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గొటబాయ తన అధికార నివాసం నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. శనివారం కర్ఫ్యూను ఎత్తివేయడంతో మళ్లీ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

మూడు నెలలుగా శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా మారాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొనడానికి రాజపక్సేల కుటుంబమే కారణమంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాగ్రహం నేపథ్యంలోనే ఇటీవల ప్రధానమంత్రి పదవికి మహెంద రాజపక్సే రాజీనామా చేశారు. అయితే గొటబాయ మాత్రం రాజీనామాకు అంగీకరించలేదు. అయితే తనకున్న అపరమితమైన అధికారాలను వదులుకునేందుకు రాజపక్సే సిద్ధమయ్యారు. ఆమేరకు రాజ్యాంగంలోని 21వ సవరణకు ప్రస్తుత ప్రధాని రాణిల్‌ విక్రమసింఘే క్యాబినేట్‌ సిద్ధమైంది. మరోవైపు దేశంలో గ్యాస్, చమురు, నిత్యావసరాలు కొరత నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

లంక తీవ్ర ఆర్థిక సంక్షోబానికి గురైన తరువాత.. తరచూ చమురు, గ్యాస్‌ కోసం ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం ఆందోళనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇవాళ ఉదయం కర్ఫ్యూ ఎత్తివేయడంతో మళ్లీ ప్రజలు నిసన ప్రదర్శనలకు దిగారు. ఈ క్రమంలో కొలంబోలోని అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఇంటి వైపు ఆందోళనకారులు దూసుకెళ్లారు. పోలీసులు లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌లను ప్రయోగించినా ఆందోళనకారులు మాత్రం ఆగలేదు. విషయం తెలుసుకున్న గొటబాయ అధికార నివాసం నుంచి పారిపోయినట్టు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories