Sri Lanka: భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీని పునరుద్ధరించిన శ్రీలంక‌

Sri Lanka Extends Visa Free Entry for Indian Visitors
x

Sri Lanka: భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీని పునరుద్ధరించిన శ్రీలంక‌

Highlights

Sri Lanka: ప‌ర్యాట‌క రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ద్వీప దేశం శ్రీలంక తాజా కీల‌క నిర్ణయం తీసుకుంది.

Sri Lanka: ప‌ర్యాట‌క రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ద్వీప దేశం శ్రీలంక తాజా కీల‌క నిర్ణయం తీసుకుంది. భార‌త్‌తో పాటు మ‌రికొన్ని దేశాల‌కు వీసా-ఫ్రీ ఎంట్రీని పునరుద్ధరించింది. త‌మ దేశానికి 30 రోజుల పర్యటనకు వచ్చే ఇండియా, చైనా, రష్యా, జపాన్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాలకు చెందిన పౌరులకు ఉచిత వీసా ప్రవేశాన్ని అందించాలని ఆ దేశ క్యాబినెట్ సోమవారం నిర్ణయించింది. ఇక‌ ఈ ఉచిత వీసా అనేది 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. కాగా, క‌రోనా కార‌ణంగా దేశంలో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని పునర్నిర్మించేందుకు పైలట్ ప్రాజెక్ట్‌గా అక్టోబర్‌లో ఈ ఉచిత వీసా పథకాన్ని శ్రీలంక ప్రారంభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories