Afghanistan: నేడు కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానం

Special Airplane From Delhi to Kabul Airport For Indians in Afghanistan Today 22 08 2021
x

కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానం (ట్విట్టర్ ఫోటో)

Highlights

* హిందూ, సిక్కు, ఆఫ్ఘన్ ప్రముఖులతో పాటు విమానంలో 85 మంది భారతీయులు * భారత్ నుంచి కాబూల్ కు ప్రతి రోజు రెండు విమానాలు

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కకున్న భారతీయులను ఇండియాకు తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతించింది. దీంతో భారతీయ వైమానిక దళం రవాణా విమానం కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి కొంతమంది ఆఫ్ఘన్ ప్రముఖులు, హిందూ, సిక్కు ప్రజాప్రతినిధులతో పాటు విమానంలో 85 మంది భారతీయులు నేడు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇప్పటికే ఐఏఎఫ్ రెండు C-17 విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బందితో సహా 200 మందని భారత్ తరలించింది.

కాబూల్ కు ప్రతిరోజూ రెండు భారతీయ విమానాలు నడపడానికి శనివారం అక్కడి బలగాలు భారత్ కు అనుమతి ఇచ్చాయి. నాటో దళాలు తమ ఆయుధాలు, పౌరులను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం రోజుకు మొత్తం 25 విమాన సర్వీసులు నడుపుతున్నాయి. మొదట సోమవారం 40 మందిని, రెండో విడుతలో భారతీయ దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బంది సహా 150 మందిని తరలించింది. ఇక కాబూల్ నుంచి ఢిల్లీకి నేడు ప్రత్యేక విమానంలో కొంతమంది రానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories