దక్షిణ కొరియాలో సైనిక పాలన విధింపు

South Korea Declares Emergency,
x

దక్షిణ కొరియాలో సైనిక పాలన విధింపు

Highlights

దక్షిణ కొరియాలో సైనిక అత్యవసర పరిస్థితిని విధించారు. దేశ రక్షణకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధ్యక్షులు యూన్ సుక్ యోల్...

దక్షిణ కొరియాలో సైనిక అత్యవసర పరిస్థితిని విధించారు. దేశ రక్షణకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధ్యక్షులు యూన్ సుక్ యోల్ ప్రకటించారు.ఈ నిర్ణయాన్ని దక్షిణ కొరియాలోని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దేశంలోని విపక్షాలు ఉత్తర కొరియాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని దక్షిణ కొరియా అధ్యక్షులు యోల్ ఆరోపించారు.

విపక్షాల వైఖరితోనే దేశంలో ఈ పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు. కమ్యూనిస్టు శక్తుల నుంచి దేశాన్ని కాపాడేందుకు మార్షల్ లా విధించినట్టు ఆయన వివరించారు. 2022 లో దక్షిణ కొరియా అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ బాధ్యతలు చేపట్టారు.అధికారం చేపట్టిన తర్వాత తన ప్రభుత్వ ఎజెండాను పార్లమెంట్ ముందుకు తీసుకెళ్లడానికి ఆయన నిరంతరం కష్టపడుతున్నారు. పార్లమెంట్ లో అధ్యక్షుడు ప్రాతినిథ్యం వహిస్తున్న పీపుల్ పవర్ పార్టీ పీపీపీ కంటే విపక్షాలకే బలం ఎక్కువ.

Show Full Article
Print Article
Next Story
More Stories