ఒమిక్రాన్ వేరియంట్‌లో హెచ్‌ఐవీ మూలాలు.. సౌతాఫ్రికా పరిశోధనల్లో...

South Africa Research Said Coronavirus Variant Omicron had Connection with Untreated HIV | Omicron Live Updates
x

ఒమిక్రాన్ వేరియంట్‌లో హెచ్‌ఐవీ మూలాలు.. సౌతాఫ్రికా పరిశోధనల్లో...

Highlights

Omicron Live Updates: హెచ్‌ఐవీ మహిళ నుంచి సంక్రమించిన ఒమిక్రాన్..

Omicron Live Updates: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్‌ అనూహ్య వేగంగా విస్తరిస్తోంది. టీకా తీసుకున్న వారిలోనూ ఇన్‌ఫెక్షన్ కలిగించేంత శక్తి ఎలా వచ్చింది...? దక్షిణాఫ్రికాలో ఉన్నా, లేనట్టే అన్నట్టు బలహీనపడిన కరోనా... ఉన్నపళంగా ఒమిక్రాన్‌‌గా ఎలా రూపాంతరం చెందింది. ఈ ప్రశ్నలే ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా శాస్త్రవేత్తలను ఆలోచనలో పడేశాయి. సమాధానాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్ మూలాల్లో హెచ్‌ఐవీ ఉందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

గతేడాది యూఎన్ ఎయిడ్స్ ఓ నివేదిక ఇచ్చింది. సౌతాఫ్రికాలో 18- 45 ఏళ్ల వయసున్న ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్‌ఐవీకి గురయ్యారని... ప్రపంచ హెచ్ఐవీ కేంద్రంగా ఆ దేశం మారిందని పేర్కొంది. ఈ వైరస్ సోకిన వారిలో 30 శాతానికి పైగా మంది అసలు యాంటీరిట్రోవైరల్‌ డ్రగ్స్‌ను తీసుకోవడం లేదని వివరించింది.

ఓ మహిళ కరోనా బారిన పడిందని, ఆమె శరీరంలోని హెచ్‌ఐవీ వైరస్‌ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా అవతరించి ఉంటుందని పరిశోధకులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్స్ బృందం కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. హెచ్‌ఐవీ వైరస్‌ తిష్ఠవేసిన శరీరంలో కరోనా విజృంభించడానికి చాలా అనువైన పరిస్థితులుంటాయి. దక్షిణాఫ్రికాలో హెచ్‌ఐవీ బాధితులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, అక్కడే ఒమిక్రాన్‌గా అవతరించి ఉండొచ్చని డాక్టర్స్ బృందం వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories