Volodymyr Zelenskyy: నాటోలో చేరేదే లేద‌న్న జెలెన్‌స్కీ.. కీలక వ్యాఖ్యలు...

Sensational Remarks by Ukrainian President Volodymyr Zelenskyy
x

నాటోలో చేరేదే లేద‌న్న జెలెన్‌స్కీ.. కీలక వ్యాఖ్యలు...

Highlights

Volodymyr Zelenskyy: మా కోసం నాటో తలుపులు తెరిచి ఉంచాయని భావించాం కానీ..ఇప్పుడు మాకు వాస్తవం తెలిసి వచ్చింది

Volodymyr Zelenskyy: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. భారీగా ప్రాణ, ఆస్తినష్టానికి తెరలేపింది. ఈ నేపథ్యంలోనే తమ గగనతలాన్ని మూసివేయాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పలుమార్లు నాటోను అభ్యర్థించినా అందుకు నాటో సుముఖత చూపించలేదు. కాగా ఈ అంశంపై జెలెన్‌స్కీ తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. రష్యాను నిలువరించే విషయంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తదితర యూరోపియన్ నాయకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తమ దేశానికి మరింత సాయమందించాలని కోరారు.

నో-ఫ్లై జోన్‌ను అమలు చేయడానికి నిరాకరించినందుకుగానూ నాటో విషయంలో జెనెన్‌స్కీ ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యంత బలమైన కూటమి నాటో. కానీ ఈ కూటమిలోని కొంతమంది సభ్యులు రష్యా దూకుడుతో హిప్నటైజ్ అయ్యారని విమర్శించారు. నో ఫ్లై జోన్‌గా ప్రకటించకపోవడం.. ఒకరకంగా రష్యన్ సైన్యానికి ఉక్రెయిన్‌లోని శాంతియుత నగరాలపై బాంబు దాడులకు అనుమతి కల్పించడమేనని ఆవేదన చెందారు. ఉక్రెయిన్ నాటో సభ్యత్వ దేశం కాదు. అందులో చేరలేమనీ అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ను రక్షించేందుకు భద్రతాపరమైన హామీలు ఇవ్వాలని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం తమ దేశ ప్రజలు నాటో కూటమి కంటే అంతర్జాతీయ భాగస్వాముల మద్దతుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా సరిహద్దులోని ఇతర దేశాలు.. నాటోను మినహాయించి తమ స్వతంత్ర రక్షణ సామర్థ్యాల గురించి ఆలోచించాలని కోరారు. బ్రిటన్‌, ఇతర దేశాల నుంచి అందుతున్న ఆయుధాలు సరిపోవడం లేదని ఫలితంగా రష్యా నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలు, పాత సోవియట్ కాలం నాటి కిట్‌లను వినియోగించాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. రష్యాపై పూర్తిస్థాయి వాణిజ్య ఆంక్షలు విధించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories