వ్యాక్సిన్‌ ఆన్‌ ద వేలోనే ఉందా... త్వరలోనే మన దగ్గరికి రాబోతోందా!

వ్యాక్సిన్‌ ఆన్‌ ద వేలోనే ఉందా... త్వరలోనే మన దగ్గరికి రాబోతోందా!
x
Highlights

చైనాలో పుట్టుకొచ్చిన కరోనా అనే ఒకానొక మహమ్మారి ప్రపంచంపై ఇప్పుడు దండయాత్ర చేస్తోంది. ఎక్కడో ఎందుకు!!. మన దేశంలోనే చూసుకుంటే లక్షల్లో కేసుల్లో, వేలల్లో...

చైనాలో పుట్టుకొచ్చిన కరోనా అనే ఒకానొక మహమ్మారి ప్రపంచంపై ఇప్పుడు దండయాత్ర చేస్తోంది. ఎక్కడో ఎందుకు!!. మన దేశంలోనే చూసుకుంటే లక్షల్లో కేసుల్లో, వేలల్లో మరణాలు కనిపిస్తున్నాయ్‌. మరి రంకెలు వేస్తున్న ఈ రక్కసికి కళ్లెం వేసేది ఎలా? దీనికి ఒకే ఒక్క ఆయుధం వ్యాక్సిన్‌. ఈ వ్యాధి ప్రబలకుండా చేసే మందు, ఇదిగో అదిగో అంటున్నారు కానీ... ఇంకా అందుబాటులోకి రాలేదు. కారణం ఏంటి? అసలు వ్యాక్సిన్ వస్తుందా లేదా? వస్తే ఎప్పుడు వస్తుంది? ప్రపంచం ఇప్పుడివే ప్రశ్నలు వేసుకుంటుంది. కరోనాను కట్టడి చేసే మందు కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తోంది. ఇంతకీ వ్యాక్సిన్‌ తయారీలో ఏ దేశం ఏ స్థాయిలో ఉంది అందులో మన స్థానం ఎక్కడుంది.? వ్యాక్సిన్‌ ఆన్‌ ద వేలోనే ఉందా... త్వరలోనే మన దగ్గరికి రాబోతోందా!!

కరోనాను ఖతం పట్టించి మహమ్మారికి దడ పుట్టించే మందు త్వరలోనే రాబోతోంది. ప్రపంచంలోని శాస్త్రవేత్తలు, మేధావులు వ్యాక్సిన్‌ తయారీలో తలమునకలై ఉన్నారు. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ తయారీ దిశగా అడుగులు పడనైతే పడ్డాయ్‌ కానీ ఎప్పుడు వస్తుందన్న దానిపై క్లారిటీ లేదు. ఇప్పటికి 20 వ్యాక్సిన్లు తయారీలో ఉండగా, వీటిలో ఒక దానిని నేరుగా మనుషులపైనే, మిగతా వాటిని జంతువులపై ప్రయోగిస్తున్నారు. ఇవి విజయవంతమైతే మనుషులపై ప్రయోగాలు మొదలుపెడతారు. ఈ ఏడాది చివరాఖరికి ఫలితాలు రావచ్చొన్నది ఒక అంచనా.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories