రోడ్డుపై ప్రయాణించిన భారీ బిల్డింగ్

రోడ్డుపై ప్రయాణించిన భారీ బిల్డింగ్
x

రోడ్డుపై ప్రయాణించిన భారీ బిల్డింగ్

Highlights

బాహుబలి లాంటి బిల్డింగ్ 139 ఏళ్ల చరిత్ర. ఉన్నట్టుండి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌కు షిఫ్ట్ అయితే.! శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫ్రాంక్లిన్‌ వీధిలో ఈ వింత జరిగింది.

బాహుబలి లాంటి బిల్డింగ్ 139 ఏళ్ల చరిత్ర. ఉన్నట్టుండి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌కు షిఫ్ట్ అయితే.! శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫ్రాంక్లిన్‌ వీధిలో ఈ వింత జరిగింది. అసాధారణమైన ఈ ప్రక్రియను చాలా ఈజీగా చేసేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఖండాంతరాలు దాటి వైరల్ అవుతోంది.

1880లో ఇటాలియన్‌ శైలిలో నిర్మితమైన ఈ బిల్డింగ్‌ను కొత్త చోటుకు మార్చాలని యజమాని నిర్ణయించుకున్నారు. ఇంకేముందీ, దాని పునాదుల పైన జాగ్రత్తగా కట్‌ చేసి రిమోట్‌ కంట్రోల్‌తో నడిచే హైడ్రాలిక్‌ డాలిని భవనం కింద అమర్చారు. ఆ తర్వాత మెల్లిగా అక్కడి నుంచి కదిలించారు. మొత్తం 7 బ్లాకులు 80 అడుగుల వెడల్పు ఉన్న ఈ భవంతి రోడ్డుపై కదులుతున్న దృశ్యాల్ని చూసిన వాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇక.. ఈ భారీ బిల్డింగ్‌ను షిఫ్ట్‌‌ చేసే క్రమంలో భవనం రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద పడవ నేలపై వెళ్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ వింతను చూసేందుకు వేలాదిమంది ప్రజలు తరలి వచ్చారు. ఇప్పుడు ఈ వీడియో ​కాస్తా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ భవనాన్ని జరపడానికి దాదాపు 8 సంవత్సరాలు పట్టిందని దాని యజమాని తెలిపాడు. భవనాన్ని కదిలించేటప్పుడు మధ్యలో ఏవి అడ్డురాకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories