Putin: బాలీవుడ్ సినిమాలు అంటే ఎంతో ఇష్టం..భారతీయ చిత్రసీమపై పుతిన్ ప్రశంసలు

Russian President Vladimir Putin has praised Indian cinema for his love of Indian films
x

Putin: బాలీవుడ్ సినిమాలు అంటే ఎంతో ఇష్టం..భారతీయ చిత్రసీమపై పుతిన్ ప్రశంసలు

Highlights

Putin: భారతీయ చిత్రసీమపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. రష్యాలో ఇండియన్ సినిమాలకు మంచి ఆదరణ ఉందని చెప్పుకొచ్చారు. కాగా రష్యాలోని కజాన్‌లో బ్రిక్స్‌ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రష్యా వెళ్లనున్నారు. ఇక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాన్ ఫిల్మీ ఇండస్ట్రీని ప్రశంసించారు. తమ దేశంలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉందని చెప్పారు. ఇండియా సభ్య దేశంగా ఉన్న ఐదు దేశాల కూటమి బ్రిక్స్ సమావేశాలు ఈనెల 22,23వ తేదీల్లో రష్యాలో జరగనున్నాయి. ఈనేపథ్యంలో పుతిన్ మీడియాతో మాట్లాడారు. బ్రిక్స్ సభ్య దేశాలకు రష్యాలో తీయబోయే సినిమాలకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తారనా అని అడిగిన ప్రశ్నకు పుతిన్ సమాధానం ఇచ్చారు.

భారతీయ సినిమాల గురించి పుతిన్ మాట్లాడుతూ:

భారతీయ సినిమాలకు రష్యాలో మంచి ఆదరణ ఉంది. మా దేశంలో 24గంటలు ఇండియన్ మూవీస్ వచ్చే ప్రత్యేక టీవీ ఛానెల్ ఉంది. మాకు భారతీయ సినిమాలు అంటే చాలా ఇష్టం. మేము బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నాము. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ ఏడాది బ్రిక్స్ దేశాలకు చెందిన సినిమాలను కూడా ప్రదర్శిస్తాం.

ఇండియన్ సినిమాలను రష్యాల్లో ప్రదర్శించేందుకు మేము సానుకూలంగా ఉన్నాము. వారి సినిమాలను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామని పుతిన్ అన్నారు.

సినిమా నిర్మాణం, సినిమా పరిశ్రమ ఆర్థిక వ్యవస్థలో భాగమని పుతిన్ అన్నారు. వీటిని సక్రమంగా నియంత్రించాలి. భారతదేశం తన సినిమా మార్కెట్‌ను కాపాడుకోవడానికి అనేక నిర్ణయాలు తీసుకుంది. దీనితో పాటు పుతిన్ వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోదీతో తన భేటీలో భారతీయ చిత్రాలను మరింత ప్రమోట్ చేయడం గురించి చర్చించవచ్చని సూచించారు.

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మోదీ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. 22వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన చివరిసారిగా జూలైలో మాస్కోను సందర్శించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ కజాన్‌లో బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన తన సహచరులు, ఆహ్వానితులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories