Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల ప్రవేశం..

Russian Forces Fired Missiles at Several Cities in Ukraine
x

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల ప్రవేశం..

Highlights

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి.

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. తూర్పు సరిహద్దులోని ఎయిర్‌ పోర్టులు, మిలటరీ స్థావరాలు, మిలటరీ గిడ్డుంగులే లక్ష్యంగా రష్యా దాడులకు దిగింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు సరిహద్దులోని పలు నగరాలు బాంబుల మోతతో దద్ధరిల్లాయి. తాజాగా క్రిమియా నుంచి ఉక్రెయిన్‌లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. దీంతో రష్యా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది.

తూర్పు ప్రాంతంలోని సరిహద్దులో మిలటరీ స్థావరాలపై రష్యా దాడులు చేస్తున్నట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. దేశమంతటా మార్షల్‌ లాను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్‌ సైతం ఎదురుదాడులు చేస్తోందని జెలెన్‌స్కీ తెలిపారు. ప్రజలు బయటకు రావొద్దని.. ఇళ్లలోనే ఉండాలని సూచించారు. సైన్యం, ప్రభుత్వం పని చేస్తోందని సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చర్చలు జరుపుతున్నామని జెలెన్‌స్కీ తెలిపారు. ఉక్రెయిన్‌ సైతం ఎదురుదాడికి దిగుతోంది. ఇప్పటివరకు 5 విమానాలను, ఒక హెలికాప్టర్‌ను కూల్చేసినట్టు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories