Vladimir Putin: రష్యా సైన్యంలో భారతీయులు..విడుదల చేసేందుకు పుతిన్ నిర్ణయం

Vladimir Putin: రష్యా సైన్యంలో భారతీయులు..విడుదల చేసేందుకు పుతిన్ నిర్ణయం
x

Vladimir Putin:రష్యా సైన్యంలో భారతీయులు..విడుదల చేసేందుకు పుతిన్ నిర్ణయం

Highlights

Vladimir Putin: రష్యా తరపున ఉక్రెయిన్ తో యుద్దంలో పాల్గొంటున్న భారతీయులకు త్వరలోనే విముక్తి లభించనుంది.పుతిన్ తో భేటీ వేళ మాస్కో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే వారిని ఆర్మీ విధులను వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఒప్పుకున్నారు.

Vladimir Putin:ప్రధాని మోదీ రష్యా పర్యటనలో భాగంగా భారత్ కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒప్పుకున్నారు. వెంటనే వారిని ఆర్మీ విధులను వెనక్కు రప్పిస్తామని, స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఒప్పుకున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రధాని మోదీకి ఇచ్చిన ప్రైవేట్ విందులో పుతిన్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం మాస్కో చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మాస్కో శివారులోని నోవో, ఒగార్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్ సాదరంగా ఆహ్వానించారు. ఆప్యాయంగా ఇరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి పుతిన్ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో రష్యాసైనంలో భారతీయుల విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావనకు తీసుకువచ్చారు. దీనికిగాను వారిని విడుదల చేసేందుకు పుతిన్ హామీ ఇచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం. అదేవిధంగా మూడోసారి విజయం సాధించినందుకు గాను మోదీని అభినందించారు. మోదీ పాలనలో భారత్ సాధించిన డెవలప్ మెంట్ ను పుతిన్ కొనియాడారు.

ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో భారత్ నుంచి తీసుకెళ్లిన యువకులను రష్యా తన సైన్యంలో చేర్చుకుంది. ఈ క్రమంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. తమను మోసం చేసి సైన్యంలో చేర్చారని సుమారు రెండు డజన్ల మంది ఆరోపణలు చేస్తున్నారు. తమను సైన్యం నుంచి విడిపించి స్వదేశానికి తీసుకెళ్లాలని గతకొంత కాలంగా వేడుకుంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే ప్రధాని మోదీ..పుతిన్ తో విందు సందర్భంగా ఈ విషయాన్నిప్రస్తావనకు తీసుకువచ్చారు.

కాగా ప్రధాని మోదీ మాస్కోలో అధ్యక్షుడు పుతిన్‌తో 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్నారు. దాదాపు ఐదేళ్లలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి.ఆయన చివరిసారిగా 2019లో రష్యాను సందర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories