నేడు, రష్యా ఉక్రెయిన్‌ మధ్య రెండో దఫా చర్చలు.. యుద్దాన్ని విరమించాలని...

Russia Ukraine Second Phase Talks Going to Held Today 02 03 2022 | Russia Ukraine War
x

నేడు, రష్యా ఉక్రెయిన్‌ మధ్య రెండో దఫా చర్చలు.. యుద్దాన్ని విరమించాలని...

Highlights

Russia - Ukraine War: ప్రత్యేక విధానం ద్వారా తమను ఈయూలో చేర్చాలంటున్నఉక్రెయిన్...

Russia - Ukraine War: ఓ వైపు యుద్ధం.. మరోవైపు చర్చలు... రష్యా - ఉక్రెయిన్ల మధ్య సాగుతున్న తంతు ఇది. భీకరంగా సాగుతున్న పోరాటంలో స్వల్ప విరామం అన్నట్లుగా రెండోసారి చర్చలకు ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇవాళ బెలారస్ లో మరోసారి రష్యా- ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్నాయి.

ఉన్నపలంగా యుద్దాన్ని విరమించాలని రష్యాను ఉక్రెయిన్‌ కోరుతుంది. ప్రత్యేక విధానం ద్వారా తమను ఈయూలో చేర్చాలంటూ ఉక్రెయిన్‌ డిమాండ్ చేస్తోంది. మరోవైపు క్రిమియాను రష్యాలో అంతర్భాగం చయాలని రష్యా కోరుతుంది. ఉక్రెయిన్‌, రష్యా మధ్య జరిగే ఈ చర్చలు ఫలించాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. ఇటు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌-రష్యా భేటీపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

అయిుతే మొన్న జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తమ వాదనలకే కట్టుబట్టాయి. దీంతో ఎలాంటి ఫలితం లేకుండానే చర్చలు ముగిశాయి. ఈ మేరకు మరోమారు బెలారస్ లోనే ఇవాళ రెండో విడత చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories