Russia-Ukraine War: ఉక్రెయిన్‌‌పై ఆగని రష్యా దాడులు

Russia Non Stop Attacks on Ukraine | Telugu News Today
x

ఉక్రెయిన్‌‌పై ఆగని రష్యా దాడులు

Highlights

Russia-Ukraine War: ఉక్రెయిన్‌ను 14.5 లక్షల మంది వీడినట్లు యూఎన్‌ఓ రిపోర్ట్

Russia-Ukraine War: ఉక్రెయిన్ రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇక ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో సుమారు 14.5 లక్షల మంది ఉక్రెయిన్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉంటారని అంతర్జాతీయ సంస్థ IOMఅంచనా వేసింది. వారంతా వెళ్లిన దేశాల మంత్రిత్వశాఖల గణాంకాల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది. కొన్ని కుటుంబాలు సెంట్రల్ బుడా‌ఫెస్ట్‌లోని న్యుగటి రైల్వే స్టేషన్ గుండా సరిహద్దులకు చేరుకొంటున్నారు. మరోవైపు మరికొందరు శరణార్ధులు జకర్‌పట్టియా ఒబ్లాస్ట్ నుండి తూర్పు ఉక్రెయిన్‌లోని సరిహద్దు గుండా వలస వెళ్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. నల్ల సముద్రంలోని ఓడరేవు నగరమైన ఒడెస్సా నుండి కూడా కూడ కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని IOM ప్రకటించింది.

అత్యధికంగా 7.87 లక్షల మంది పోలండ్‌కు వలసవెళ్లారు. అలాగే 2.28 లక్షల మంది మోల్దోవాకు, 1.44 లక్షల మంది హంగరీకి, 1.32 లక్షల మంది రొమేనియాకు, లక్ష మంది స్లోవేకియాకు వెళ్లిపోయినట్లు IOMతెలిపింది. 138 దేశాలకు చెందిన వారు ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటి పొరుగు దేశాలకు వెళ్లినట్లు పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories