Russia COVID-19 vaccine: వారంలోగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి రంగం సిద్ధం

Russia COVID-19 vaccine: వారంలోగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి రంగం సిద్ధం
x

 Russia COVID-19 vaccine

Highlights

Russia COVID-19 vaccine:ప్రపంచ దేశాల‌ను ప‌ట్టి పీడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా.. ఈ వైర‌స్‌ను అంతం చేయడానికి రష్యా శాస్త్ర‌వేత్తలు ఓ అడుగు ముందే ఉన్నార‌ని చెప్పాలి.

Russia COVID-19 vaccine: ప్రపంచ దేశాల‌ను ప‌ట్టి పీడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా.. ఈ వైర‌స్‌ను అంతం చేయడానికి రష్యా శాస్త్ర‌వేత్తలు ఓ అడుగు ముందే ఉన్నార‌ని చెప్పాలి. వైర‌స్ ను అంతం చేయ‌డానికి ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌గా స్పుత్నిక్-వీ నమోదైందని అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ప్రకటించిన కొద్దివారాల అనంతరం వ్యాక్సిన్‌ విస్తృత పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రష్యా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గమలేయ రిసెర్ట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ ఈ వ్యాక్సిన్ ను అభివృధ్ది చేసింది. ప్రజల వినియోగం కోసం ఓ బ్యాచ్ టీకాను విడుదల చేసేందుకు గమలేయ ఇన్ స్టిట్యూట్ కు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని రష్యా అకాడెమీ సైన్సెస్ అసోసియేట్ మెంబర్ డెనిస్ అన్నారు. సెప్టెంబర్ 10 నుంచి 13 మధ్య ప్రజల వినియోగం కోసం ఓ బ్యాచ్ టీకాను విడుదల చేసేందుకు మేము అనుమతి పొందుతామనే నమ్మకం ఉంది. అప్పటి నుంచి జనాలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభం అవుతుంది అని డెనిస్ తెలిపారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని తెలిపారు.

రష్యా వ్యాక్సిన్ పై పోస్ట్ రిజిస్ట్రేషన్ క్లినికల్ ఆధ్వ‌ర్యంలో అధ్య‌య‌నం చేస్తున్నట్టు తెలిపారు. సుమారు 40వేల మంది ప్రజలు ఈ అధ్యయనంలో పాల్గొంటారని, తమ తొలి దశ ప్రయోగాల్లో వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలిందని, మెరుగైన ఫలితాలు చూపిందని ఇటీవలే పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో స్పుత్నిక్‌-వి తొలి, రెండో దశ ప్రయోగాల ఫలితాలను పరిశోధకులు ఇటివ‌ల‌ ప్రచురించారు.

అయితే ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించకుండానే, టీకాను ఆమోదించి, విడుదల చేయడంపై నిపుణులు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితం? అనే చర్చ జరుగుతోంది.

ఈ సందేహాలకు చెక్ పెడుతూ.. లాన్సెట్‌ ‌జర్నల్‌ రష్యా వ్యాక్సిన్‌ పై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 76 మందిపై వ్యాక్సిన్‌ ప్రయోగం చేయ‌గా.. వాళ్లలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కన్పించలేదని, 42 రోజుల పాటు క్లినికల్‌ ట్రయల్స్‌ తర్వాత ఈ విషయాలు బయటపడ్డాయని తెలిపింది. 21 రోజుల్లోనే వాలంటీర్లలో యాంటీబాడీస్‌ తయారైనట్టు లాన్సెట్‌ జర్నల్‌ వెల్లడించింది

Show Full Article
Print Article
Next Story
More Stories