Russia Vaccine Update : కరోనా వ్యాక్సిన్ విడుదల చేసిన రష్యా

Russia Vaccine Update : కరోనా వ్యాక్సిన్ విడుదల చేసిన రష్యా
x
Russia President Vladimir Putin
Highlights

Russia Vaccine Update : కంటికి కనిపించని కరోనా వైరస్ గత కొన్ని నెలలుగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది..

Russia Vaccine Update: కంటికి కనిపించని కరోనా వైరస్ (Corona Vaccine)గత కొన్ని నెలలుగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది.. దీనికి వ్యాక్సిన్ ని కనిపెట్టే పనిలో ప్రపంచ శాస్త్రవేత్తలు నిమగ్నం అయి ఉన్నారు.. అయితే ఈ వైరస్ కి రష్యా (Russia) వ్యాక్సిన్‌ను కనుగొంది.. ఈ విషయాన్నీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించాడు... రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపిందని వ్లాదిమిర్ అన్నారు.. దేశ రాజధానిలోని మాస్కోలోని గమలేయ ఇన్‌స్టిట్యూట్ ఇది అభవృద్ధి చేసిందని అయన వెల్లడించారు.

వ్యాక్సిన్ ప్రయోగాల్లో భాగంగా తన కుమార్తె సహా ఇతరులకి ఈ వ్యాక్సిన్ ఇవ్వగా సానుకూల ఫలితాలు వచ్చాయని అయన వెల్లడించారు.. దీంతో ప్రపంచంలో విడుదలైన తొలి కరోనా వ్యాక్సిన్ తమదేనని వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఈ టీకా ద్వారా రోగనరోధక శక్తి పెరిగి కరోనా నియంత్రణలోకి వస్తుందని వివరించారు. ఈ వ్యాక్సిన్‌ను త్వరలోనే భారీగా ఉత్పత్తి చేయనున్నట్లుగా అయన స్పష్టం చేశారు.. ఇక ఈ వ్యాక్సిన్ ను మొదటగా మెడికల్ సిబ్బంది, టీచర్లకి అందించనున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి..

ఈ టీకా కొరోనావైరస్ నుండి రెండేళ్ల వరకు రోగనిరోధక శక్తిని ఇస్తుందని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories