మరోసారి భారీ పేలుడుతో దద్ధరిల్లిన కాబూల్.. అమెరికా సేనలే లక్ష్యంగా పేలుడు

Rocket Hits House Near Kabul Airport
x

మరోసారి భారీ పేలుడుతో దద్ధరిల్లిన కాబూల్

Highlights

Kabul Airport: ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబుల్‌ ఎయిర్‌పోర్టుకు సమీపంలో రాకెట్‌ దాడి జరిగింది.

Kabul Airport: ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబుల్‌ ఎయిర్‌పోర్టుకు సమీపంలో రాకెట్‌ దాడి జరిగింది. మరో ఉగ్రదాడి జరగొచ్చన్న అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఈ ఘటన వెలుగు చూడడంతో కలకలం రేగింది. అమెరికా సైనికులే లక్ష్యంగా ఐసిస్‌ ఉగ్రవాదులు ఈ రాకెట్‌ దాడికి పాల్పడి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతిచెందినట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమని ఏ ఉగ్ర సంస్థా ప్రకటించుకోలేదు.

మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌ విమానాశ్రయం సమీపంలో ఆత్మాహుతికి యత్నించిన దళ సభ్యుడిని అమెరికా సైన్యాలు మట్టుబెట్టాయి. ఓ వైపు తమ దేశ పౌరుల తరలింపు ప్రక్రియను చేపడుతున్న వేళ ఆత్మాహుతి దాడికి ఓ వాహనంలో సిద్ధంగా ఉన్న వ్యక్తిపై అమెరికా బలగాలు వైమానిక దాడి జరిపాయని తాలిబన్‌ అధికార ప్రతినిధి తెలిపారు. మృతి చెందిన వ్యక్తి ఐసిస్‌-కె ఉగ్రవాద ముఠాకు చెందిన వాడిగా భావిస్తున్నారు. ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనలతో మరోసారి కాబూల్‌ దద్దరిల్లింది.

ఇటీవల కాబూల్ ఎయిర్ పోర్టు దగ్గర జరిగిన జంట పేలుళ్ల ఘటనలో 100 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనలో 13 మంది అమెరికా సైనికులు కూడా మరణించారు. ఆత్మాహుతి దాడికి సూత్రధారిగా ఉన్న ఉగ్రవాది సహా ఇద్దరు కీలక ముష్కరుల్ని అమెరికా సైన్యాలు మట్టుబెట్టాయి. తమ సైనికులను బలిగొన్న ఉగ్రవాదుల్ని విడిచిపెట్టేది లేదన్న అగ్రరాజ్యం వైమానిక దాడులకు దిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories