Israel: ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడి..చిన్నారులతో సహా 11 మంది మృతి
Israel: ఇజ్రాయెల్‌పై శనివారం రాకెట్లతో దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 11 మంది చనిపోయారు. మరణించిన వారిలో చాలా మంది చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం.
Israel:ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న గోలన్ హైట్స్‌పై శనివారం రాకెట్ అకస్మాత్తుగా దాడి చేసింది. పిల్లలందరూ.. ఫుట్‌బాల్ ఆడుతుండగా రాకెట్ దాడి జరిగింది. ఈ రాకెట్ దాడిలో చాలా మంది చిన్నారులతో సహా 11 మంది మరణించారు. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా గ్రూపులోని ముగ్గురు సభ్యులు మరణించిన కొన్ని గంటల తర్వాత ఈ రాకెట్ దాడి జరిగింది. దీని వెనక లెబనాన్ కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజ్ బొల్లా హస్తం ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇదొక తీవ్రమైన ఘటనగా పేర్కొంది. తదానుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఈ దాడికి తాము కారణమని ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలను హెచ్ బొల్లా ఖడించింది. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని పేర్కొంది.
ఈ చిన్నారులపై హెచ్ బొల్లా రాకెట్ ను ప్రయోగించిందని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రధాన ప్రతినిధి డేనియల్ హగారి ఆరోపణలు చేశారు. ఈ విషయంలో హెజ్ బొల్లా అబద్దం చెబుతోందన్నారు. గాజాలో యుద్ధానికి దారితీసిన అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడిని అని డేనియల్ పేర్కొన్నారు. కాగా హిజ్బుల్లా ఈ దాడికి ఇంతవరకు చెల్లించని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు.
Massive drone attack on Israel.
— Sunanda Roy 👑 (@SaffronSunanda) July 27, 2024
9 kids died and 30 others injured. The kids were playing football on the ground when the drone attacked them.
Those kids were also innocent but no one from the world liberal lobby condemned this.
In fact few liberals stand with Hezbollah.… pic.twitter.com/UbRwrd1HCa
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire