Breaking News: చరిత్ర సృష్టించిన రిషి సునాక్‌.. బ్రిటన్‌ ప్రధానిగా రిషి..

Rishi Sunak Become Britain’s Prime Minister
x

Breaking News: చరిత్ర సృష్టించిన రిషి సునాక్‌.. బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునక్‌.. 

Highlights

Rishi Sunak: కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడు, భారత మూలాలున్న బ్రిటన్ ఎంపీ రిషి సునాక్.. చరిత్ర సృష్టించాడు.

Rishi Sunak: బ్రిటీష్ గడ్డపై భారత సంతతి వ్యక్తి.. రిషి సునాక్‌ చరిత్ర సృష్టించారు. ఆ దేశ పీఠం కైవసం చేసుకున్నారు.. ప్రధాని పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ నుంచి పెన్నీ మోర్డాంట్‌ తప్పుకోవడంతో.. రిషి ఎన్నిక లాంఛనమైంది. మాజీ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో మరోసారి ప్రధాని పదవికి పోటీ ఏర్పడింది. బోరిస్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో రేసులో రిషితో పాటు పెన్నీ మోర్డాంట్‌ ఉన్నారు. అయితే రిషికి 193 మంది ఎంపీల మద్దతు ఉండగా.. మోర్డాంట్‌ కేవలం 26 మంది ఎంపీలు మాత్రమే మద్దతు పలికారు.

దీంతో మోర్డాంట్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పోటీలో ఎవరూ లేకపోవడవంతో రిషి సునాక్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. నాడు బ్రిటిషర్లు రవిఅస్తమించని సామ్రాజ్యాన్ని నెలకొల్పి ప్రపంచాన్ని ఇబ్బందుల పాలు చేశారు. మనదేశ సంపదను కొల్లగొట్టారు. స్వాతంత్ర్య సంగ్రామంలో మహనీయులను పొట్టన పెట్టుకున్నారు. అదే బ్రిటిష్ గడ్డపై భారత సంతత వ్యక్తి ప్రభంజనం సృష్టించారు. ప్రజాస్వామ్య బద్ధంగా దేశ పీఠాన్ని దక్కించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories