Vladimir Putin: మెట్లపై నుంచి జారిపడిన పుతిన్‌.. తుంటి ఎముక విరిగిందా..?

Putin Slipped On Stairs At Home Leads To Involuntary Defecation
x

Vladimir Putin: మెట్లపై నుంచి జారిపడిన పుతిన్‌.. తుంటి ఎముక విరిగిందా..?

Highlights

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై రక రకాల వార్తలు

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఏమైంది..? ఆయన ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజముందా..? పుతిన్ ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో..మెట్లపై నుంచి జారిపడినట్లు న్యూయార్క్ పోస్టు వెల్లడించింది. మెట్లు దిగుతుండగా కాలు జారీ కింద పడినట్లు తెలుస్తోంది. దీంతో 70 ఏళ్ల పుతిన్‌ తుంటి ఎముక విరిగిపోయినట్లు వార్తలు విన్పిస్తున్నాయి.

పుతిన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో వాస్తవం ఎంతవరకు ఉందనే విషయం మాత్రం తెలియరావడంలేదు. ప్రస్తుతం పుతిన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై క్రెమ్లిన్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories