Israel-Hamas War: యుద్ధభూమిలో పోలియో వ్యాక్సినేషన్ వేళ.. గాజాలో బాంబు దాడి..48 మంది పాలస్తీనియన్లు దుర్మరణం

Polio Vaccination in Gaza Middle East Heavy Israeli Bombardment
x

Israel-Hamas War: యుద్ధభూమిలో పోలియో వ్యాక్సినేషన్ వేళ.. గాజాలో బాంబు దాడి..48 మంది పాలస్తీనియన్లు దుర్మరణం

Highlights

Israel-Hamas War:ఇజ్రాయెల్ సైన్యం తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఎటువంటి రాయిని వదిలిపెట్టడం లేదు. హమాస్ ను దాదాపు అంతమొందించింది. గాజాలో భీకర పోరాటాల మధ్య, ఇజ్రాయెల్, హమాస్ పోలియో టీకా ప్రచారం కోసం కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే పోలియో వ్యాక్సినేషన్ ప్రచారానికి ముందు, ఇజ్రాయెల్ మధ్య, దక్షిణ ప్రాంతాలలో 48 మంది పాలస్తీనియన్లను హతమార్చింది.

Israel-Hamas War: గాజాలో పోలియో వ్యాక్సినేషన్ ప్రచారానికి ముందు, ఇజ్రాయెల్ మధ్య, దక్షిణ ప్రాంతాలలో భారీ బాంబు దాడిలో 48 మంది పాలస్తీనియన్లను కాల్చి చంపింది. గాజాలోని 640,000 మంది పిల్లలకు టీకాలు వేయడానికి ఇజ్రాయెల్, హమాస్ మధ్య ప్రాంతీయ ఎనిమిది గంటల కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి అంగీకరించింది. కానీ టీకా ప్రారంభించకముందే ఇజ్రాయెల్ చేసిన దాడులు ఈ ప్రచారం విజయంపై సందేహాలను లేవనెత్తుతున్నాయి.

గాజాలో ఒక చిన్నారిలో పోలియో వైరస్ కనిపించిన తర్వాత ఈ ప్రచారాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ప్రచారంలో రెండు వేల మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయనున్నారు. శుక్రవారం తెల్లవారుజామున, గాజాలో ఔషధాలను తీసుకువెళుతున్న వాహనాల కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది.మరో ఘటనలో శనివారం వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ ప్రాంతంలో యూదుల నివాసాల సమీపంలో ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాలస్తీనియన్లు మరణించారు.

ఈ పాలస్తీనా మిలిటెంట్లు రెండు వేర్వేరు ప్రదేశాలలో ఉన్న యూదుల స్థావరాలపై దాడి చేసేందుకు వచ్చారని, భద్రతా సిబ్బందిని చూడగానే కాల్పులు జరపడం ప్రారంభించారని, ప్రతీకార కాల్పుల్లో ఇద్దరూ మరణించారని ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది.

కాగా ఇజ్రాయెల్,హమాస్ యుద్ధంతో అతలాకుతలమైన గాజాలో ఈమధ్యే పోలియో కేసు వెలుగుచూడటం కలకం రేపింది. పాతికేళ్లలో తొలిసారిగా ఈ కేసు నమోదు కావడం డబ్ల్యూహెచ్ఓ అలర్ట్ అయ్యింది. ఆదివారం నుంచి చిన్నారుల టీకాల పంపిణీ చేపడతామని ప్రకటించింది. అయితే దీనికి ఒకరోజు ముందుగానే ఈ ప్రక్రియ ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది.

గాజాలో దాదాపు 6,50,000మంది చిన్నారులకు తొలిరౌండ్ వ్యాక్సిన్ వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్స్ తీసుకెళ్తున్న ట్రక్కుపై ఇజ్రాయెల్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories