Airlines plane: పెరూలో రన్‌ వేపై ఫైర్ ట్రక్కును ఢీకొన్న విమానం.. చెలరేగిన మంటలు

Plane Taking Off in Peru Strikes Vehicle on Runway Catches Fire
x

Airlines plane: పెరూలో రన్‌ వేపై ఫైర్ ట్రక్కును ఢీకొన్న విమానం.. చెలరేగిన మంటలు

Highlights

Airlines plane: విమానం నుంచి చెలరేగిన మంటలు.. ఫైర్ ట్రక్కులో ఉన్న ఇద్దరు సిబ్బంది మృతి

Airlines plane: పెరూలోని లిమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన లాటం ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై ఫైర్‌ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. అయితే ఫైర్ ట్రక్కులో ఉన్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారు. మరో ఉద్యోగి గాయపడ్డాడని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానం రన్‌వేపై ఫైర్‌ట్రక్కును ఢీకొట్టి మంటలు చెలరేగిన కొద్ది క్షణాల వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూసింది.(Airlines plane) ఈ ప్రమాదం అనంతరం విమానం నుంచి మంటలు చెలరేగాయి.(Catches Fire)

ప్రమాదం జరిగిన ఎయిర్ బస్ ఎ 320 నియో విమానంలో 102 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.విమానం నుంచి ప్రయాణికులందరినీ సురక్షితంగా దించామని విమానాశ్రయం అధికారులు చెప్పారు.అగ్నిమాపక సిబ్బంది కుటుంబాలకు అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో తన సంతాపాన్ని ట్వీట్‌లో తెలిపారు.విమానం లిమా నుంచి పెరువియన్ నగరమైన జూలియాకాకు వెళుతుండగా రన్ వేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అనంతరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు.ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories