బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్ కాల్చివేత.. చంపింది భర్తే..?

బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్ కాల్చివేత.. చంపింది భర్తే..?
x
Highlights

శనివారం సాయంత్రం బలూచిస్తాన్ కెచ్ జిల్లాలోని తుర్బాట్ ప్రాంతంలో ఘోరం జరిగింది..

శనివారం సాయంత్రం బలూచిస్తాన్ కెచ్ జిల్లాలోని తుర్బాట్ ప్రాంతంలో ఘోరం జరిగింది. ఇంటి వద్ద ఉన్న ఓ మహిళా జర్నలిస్టును కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ లో గృహ హింసకు భయంకరమైన ఉదాహరణల వరుసలో ఇది తాజా సంఘటన. బాధితురాలు - షహీనా షాహీన్, పిటివిలో వ్యాఖ్యాత గానే కాకుండా స్థానిక పత్రిక సంపాదకురాలిగా కూడా ఉన్నారు. అంతేకాదు ఆమె బలూచిస్తాన్ విశ్వవిద్యాలయంలో లలిత కళల విద్యార్థిగా ఉన్నారు. బలూచిస్తాన్ లో ఆమె నివసిస్తున్న ప్రాంతంలో క్రమంగా ప్రసిద్ధి చెందుతున్నారు. అయితే ఆమె ఎదుగుదలను ఓర్చుకోలేక ఆమె భర్త షాహీనే భార్యను కాల్చి చంపి ఉంటారని స్థానికులు నమ్ముతున్నారు. పోలీసులు విషయం తెలుసుకొని అక్కడికి వచ్చారు.

షాహీన్ మరణం వెనుక కుట్రకోణం ఉందని ఈ హత్య గృహ హింసలో భాగంగానే జరిగి ఉంటుందని కెచ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నజీబుల్లా పంద్రాని అన్నారు, ఈ హత్యపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. కాగా 2018 లో ఒక నివేదికలో బలూచిస్తాన్‌లో 30 నుంచి 50 మంది మహిళలు గృహహింస కారణంగా మృతి చెందినట్లు అంచనా వేసింది. మహిళల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థ అయిన ఔరాత్ ఫౌండేషన్ ఈ నివేదికను బయటపెట్టింది. దీనిని ప్రాంతీయ రాజధాని క్వెట్టాలో విలేకరుల సమావేశంలో ప్రజలతో పంచుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories